BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్ పై అద్బుతమైన తగ్గింపు ఆఫర్..

|

ప్రభుత్వ ఆధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో ఇండియాలో ఇప్పటికే నంబర్ వన్ ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) సర్వీస్ ప్రొవైడర్ గా మంచి గుర్తింపును కలిగి ఉంది. దేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే కాకుండా అద్భుతమైన ఆఫర్‌లను వినియోగదారులకు అందిస్తూ ప్రతి నెలా లక్షకు పైగా నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను జోడిస్తోంది. ఇప్పుడు దాని బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును మరింత పెంచడానికి కొత్త కనెక్షన్ ను పొందాలని చూస్తున్న వారికి అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్‌లకు అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. BSNL బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ యొక్క కొత్త ప్రయోజనం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL కొత్త కనెక్షన్ మొదటి నెల తగ్గింపు ఆఫర్

BSNL కొత్త కనెక్షన్ మొదటి నెల తగ్గింపు ఆఫర్

BSNL యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎంచుకున్న కొత్త కస్టమర్లకు మొదటి నెలలో రూ.500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ను టెల్కో తన యొక్క వెబ్ సైట్ లో ప్రకటించింది. కొత్త BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెళ్లే కస్టమర్‌లు దేశంలోని అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మరియు సర్కిల్‌లలో వారి మొదటి నెల ఛార్జీపై రూ.500 వరకు అంటే 90% తగ్గింపును పొందేందుకు అర్హులు అవుతారు. ఇది ప్రమోషనల్ ఆఫర్ అయినందున ఈ ఆఫర్ 90 రోజుల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది.

Twitter కార్డ్ ప్రివ్యూ ఫీచర్‌ను తిరిగి తీసుకువస్తున్న ఇన్‌స్టాగ్రామ్!! వివరాలు ఇవిగోTwitter కార్డ్ ప్రివ్యూ ఫీచర్‌ను తిరిగి తీసుకువస్తున్న ఇన్‌స్టాగ్రామ్!! వివరాలు ఇవిగో

BSNL

ఈ ఆఫర్ ద్వారా BSNL తన బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్‌కు మరింత మంది కొత్త కస్టమర్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ దీనిని 'దీపావళి ధమాకా ఆఫర్ 2021' పేరుతో పిలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ నవంబర్ 1, 2019 నుండి జనవరి 29, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు BSNL నుండి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కావాలంటే మీరు నేరుగా మీ ఇంటి వద్ద కూర్చొని కంపెనీ వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు.

భారత్ ఫైబర్

మీరు ఇప్పటికి ఇంటి వద్దనే ఉండి పనిచేస్తూ ఉంటే కనుక మరియు కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని కొనుగోలు చేయడం గురించి ఆలోచించినట్లయితే BSNL టెల్కో తన యొక్క వినియోగదారులకు అందిస్తున్న గొప్ప ఆఫర్‌ ఇదే కావడంతో కనెక్షన్ పొందడానికి ఇదే ఉత్తమ సమయం. BSNL ఇటీవల అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను క్రమబద్ధీకరించడం గమనించదగ్గ విషయం. ఈ ప్లాన్‌లు ఇప్పుడు దీర్ఘకాలిక వాలిడిటీలకు అందుబాటులో ఉంటాయి. ఈరోజు మీరు BSNL భారత్ ఫైబర్ నుండి పొందగలిగే అత్యుత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకటి 'ఫైబర్ ప్రీమియం' ప్లాన్. ఇది 200 Mbps డౌన్‌లోడ్ వేగం మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క ఉచిత ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని అందిస్తుంది.

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు ఎలాంటి ప్రమోషనల్ వాలిడిటీ లేకుండా తమకు ఆసక్తి ఉన్న ప్లాన్‌లను ఎంచుకోగలుగుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ ప్రీమియం -1 ప్లాన్ 100 Mbps వేగంతో 1000GB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితి దాటిన తరువాత డేటా వేగం 5 Mbps కి పడిపోతుంది. మరోవైపు సూపర్‌స్టార్ ప్రీమియం-2 ప్లాన్ 150 Mbps వేగంతో 2000GB వరకు FUP డేటాను అందిస్తుంది. ఈ FUP పరిమితిని పూర్తి చేసిన తరువాత డేటా వేగం 10 Mbps కి పడిపోతుంది.

BSNL FTTH

BSNL FTTH కొత్త ప్లాన్‌లను ఎంచుకునే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా Yupp TV మరియు BSNL Cinamplus సేవలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్‌లతో పాటుగా ఉచిత యాక్సిస్ లభిస్తున్న ఇతర OTT సబ్‌స్క్రిప్షన్‌లలో సోనీ లివ్ ప్రీమియం, ZEE5 ప్రీమియం మరియు వోట్ సెలెక్ట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా Yupp TV లైవ్ టీవీ ఛానెల్‌లు, వెబ్ సిరీస్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లు మరియు తాజా సినిమాలను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లతో OTT సేవలను అందించడానికి అండమాన్ మరియు నికోబార్ సర్కిల్ మినహా అన్ని సర్కిళ్లలోని వినియోగదారుల కోసం ఈ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని అధికారికంగా నిర్ణయించింది. చందాదారులు ఈ ప్లాన్‌లను ఎంచుకున్న వెంటనే బండిల్డ్ OTT సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం Yupp TV యొక్క చెల్లుబాటు మార్చి 31, 2022 కాబట్టి బండిల్ ఆఫర్ సర్వీస్ ప్రొవైడర్‌తో కంపెనీ ఒప్పందం గడువు ముగిసే వరకు చెల్లుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Diwali Dhamaka Offer 2021: New Broadband Connection Offers Up to Rs.500 Discount in The First Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X