శరవేగంగా BSNL 4G నెట్‌వర్క్ పనులు.. వారంలోనే 1000 టవర్ల ఏర్పాటు.. వచ్చే నెల నుంచే సర్వీసులు..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G టెక్నాలజీని సమకూర్చుకుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-Dot), తేజస్ నెట్‌వర్క్స్, టీసీఎస్ (TCS) ఇందుకోసం పనిచేశాయి. BSNL నెట్‌వర్క్‌ను TCS నిర్వహించనున్నట్లు (BSNL 4G Network) తెలిపింది. గ్రామీణ ప్రాంతాలు సహా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకూ నెట్‌వర్క్ ను విస్తరించాలని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది.
4G నెట్‌వర్క్ కోసం BSNL దేశవ్యాప్తంగా లక్షకు పైగా టవర్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. వీటి ద్వారా 4G మరియు 5G సర్వీసులను అందించాలని భావిస్తోంది. కేంద్రం ఇప్పటికే ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా BSNL కోసం స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయబడింది. ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జీ ధరలను పెంచిన నేపథ్యంలో అధిక శాతం మంది వినియోగదారులు BSNL నెట్‌వర్క్ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో BSNL కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపింది. 4G, 5G సర్వీసుల కోసం దేశంలో 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 12,000 టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. గతవారంలోనే 1000 టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇప్పటికే BSNL 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి BSNL కు పోర్టింగ్ అయ్యేందుకు.. మీ ఫోన్ నుంచి PORT అని టైప్ చేసి స్పెస్ ఇవ్వాలి. స్పెస్ తర్వాత 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి (PORT 94********). ఆ మెసెజ్‌ను 1900 నంబర్‌కు పంపించాలి. అనంతరం మీకు ఒక UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది.

జమ్ము కశ్మీర్‌లో అయితే మెసెజ్‌కు బదులుగా 1900 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. UPC వ్యాలిడిటీ 15 రోజులు లేదా సిమ్ కార్టు పోర్టింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంటుంది. అదే జమ్ము కశ్మీర్, అస్సోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది.
UPC వచ్చాక మీకు సమీపంలోని BSNL కార్యాలయానికి వెళ్లి, మీ గుర్తింపు కార్డు సహా ఇతర వివరాలు అందించాలి. అయితే BSNL కు పోర్టింగ్ అయ్యేందుకు సంస్థకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు అందించిన అనంతరం కొత్త సిమ్ కార్డును పొందవచ్చు. నిర్ది్ష్ట గడువులోకి BSNL నెట్‌వర్క్ యాక్టివేట్ కానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








