Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ రెండు నగరాల్లో త్వరలో 5G నెట్‌వర్క్‌..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఇటీవలే దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటు చేసింది. మరిన్ని టవర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా నెట్‌వర్క్‌ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. గత సంవత్సరం రూ.25 వేల ఖర్చు చేసిన BSNL.. ఈ సంవత్సరం నెట్‌వర్క్‌ సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఏకంగా రూ.47 వేల కోట్లు అందుకోనుందని ఇటీవల వెల్లడయింది.

ఫలితంగా 4G పూర్తి స్థాయి విస్తరణతోపాటు 5G ప్రారంభానికి ఈ నిధులు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రాంతాల్లో జియో, ఎయిర్‌టెల్‌ 5G నెట్‌వర్క్‌ ను అందిస్తున్నాయి. మరో సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vi) ప్రముఖ నగరాల్లో 5G ని క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

bsnl 5g launch news in telugu

BSNL ఇప్పటికే 5G ట్రయర్స్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. తొలుత ప్రముఖ మెట్రో నగరాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G నెట్‌వర్క్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే BSNL మాత్రం 5G ప్రారంభంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

బీఎస్‌ఎన్ఎల్ 5G ప్రారంభం ఎప్పుడంటే :
ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం BSNL 5G నెట్‌వర్క్ ఈ సంవత్సరం డిసెంబర్‌ లో దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో 5G టెస్టింగ్‌ జరుగుతోందని తెలుస్తోంది. 5G SA, 5G NSA రూపాల్లో టెస్టింగ్‌ జరుగుతోందని తెలుస్తోంది.

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్న బీఎస్‌ఎన్ఎల్‌ 5G పరికారాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఫలితంగా డిసెంబర్ నాటికి 5G నెట్‌వర్క్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

bsnl 5g launch news in telugu

బీఎస్‌ఎస్ఎల్ 4G సహా ఇతర టెక్నాలజీని పూర్తి స్వదేశీయంగానే అభివృద్ధి చేసింది. ఇందుకు టాటా సహా ఇతర సంస్థలతో జతకట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా నెట్‌వర్క్‌ అభివృద్ధి సహా ఇతర మెరుగుదలలపై బీఎస్‌ఎన్‌ఎల్ పనిచేస్తోంది. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

* ఓ వైపు నెట్‌వర్క్‌ అభివృద్ధితోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటూనే మరో వైపు రీఛార్జ్ ప్లాన్‌లతో యూజర్లకు ఆకట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్‌ పేరుతో రూ.1 రీఛార్జ్‌ తో నెలరోజులపాటు వ్యాలిడిటీని అందించింది.

Take a Poll

అయితే దసరా సందర్భంగా మరో ఆఫర్‌ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై 2 శాతం డిస్కౌంట్‌ ను అందించనుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌, సెల్ఫ్‌కేర్‌ యాప్‌ ద్వారా మాత్రమే చేసే రీఛార్జ్‌లపైనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లు రూ.199, రూ.485, రూ.1999 రీఛార్జ్‌ ప్లాన్‌లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి ఈ ఆఫర్‌ అమల్లోకి వచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ X హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అక్టోబర్‌ 15 వ తేదీ వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X