జియో, ఎయిర్‌టెల్‌లకు చావు దెబ్బ, ఏకంగా 5జీతో దూసుకొస్తున్న BSNL

Written By:

టెలికం మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నజియో, ఎయిర్‌టెల్‌లకు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ షాక్ ఇవ్వనుంది. 4జీతో బుడి బుడి అడుగుల వేస్తున్న ఇండియాకు ఏకంగా 5జీతో బిఎస్ఎన్ఎల్ నడకలు నేర్పనుంది.

వారెవ్వా..రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్

ఈ ఏడాది మార్చి నాటికి 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ట్రయల్స్‌ ప్రారంభించే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇదే జరిగితే టెలికం మార్కెట్లో మరో సంచలనం జరగనుంది.

Airtel, జియోలకు BSNL షాక్, 90 రోజుల పాటు అన్నీ అన్‌లిమిటెడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లార్సన్‌ అండ్‌ టూబ్రో, హెచ్‌పీ సంస్థలతో చర్చలు

5జీ సర్వీసులకు కావాల్సిన పరికరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే లార్సన్‌ అండ్‌ టూబ్రో, హెచ్‌పీ సంస్థలతో చర్చలు ప్రారంభించింది.

7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌

అత్యధిక స్పీడ్‌తో డేటాను అందించగలిగేలా 7 లక్షల కిలోమీటర్ల మేర బీఎస్‌ఎన్‌ఎల్‌కు అతి పెద్ద ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉంది.

నోకియాతో చర్చలు

5జికి సంబంధించి గత వారం నోకియాతో చర్చలు జరిపామని, ట్రయల్స్‌ ప్రారంభించిన తర్వాత అవసరాల గురించి ఆ సంస్థకు తెలియజేస్తామంటూ నెట్‌వర్క్‌ సంస్థ కొరియంట్‌తో అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడారు.

5జి సర్వీసులకు సంబంధించిన నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌

ఒప్పందం మేరకు 5జి సర్వీసులకు సంబంధించిన నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌, సర్వీస్‌ ఇన్నోవేషన్‌ను పొందించుకోవడానికి మాత్రమే సహకారం కొరియంట్‌ తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. ఇది కేవలం నాలేడ్జ్‌ షేరింగ్‌కు సంబంధించిన ఒప్పందమేనని ఆయన స్పష్టం చేశారు.

తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని..

మరోవైపు 5జీ టెక్నాలజీపైనా, ముఖ్యంగా నెట్‌వర్క్‌ డిజైన్‌పైనా తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పంచుకోనున్నట్లు కోరియంట్‌ చైర్మన్‌ షేగాన్‌ ఖెరాద్‌పీర్‌ తెలిపారు.

వేగవంతమైన డేటా

అత్యధిక వేగవంతమైన డేటా అవసరమయ్యే స్వయంచాలిత కార్లు మొదలైన వాటికి 5జీ టెక్నాలజీ అనువుగా ఉంటుందని ఆయన తెలిపారు.

4జీ కన్నా 5జీ టెక్నాలజీ సేవలు

3జీ, 4జీ నెట్‌వర్క్‌నే ఉపయోగించినప్పటికీ... సామర్థ్యాలు పెరగడం వల్ల 4జీ కన్నా 5జీ టెక్నాలజీ సేవలు మరింత వేగవంతంగా ఉంటాయని బిఎస్ఎన్ఎల్ సీఎండి తెలిపారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లేటెస్ట్ టెక్నాలజీ స్టోరీల కోసం క్లిక్ చేయండి 

English summary
BSNL expects to start 5G service trials by March 2018 Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot