రూ.1 రీఛార్జ్‌తో రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. ఆఫర్‌ను పొడిగించిన BSNL
బీఎస్‌ఎన్‌ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో తీసుకొచ్చిన ఆజాదీ కా ప్లాన్ ఆఫర్‌ను (BSNL Azadi Ka Plan) మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్‌కు వస్తున్న స్పందన కారణంగానే పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL వెల్లడించింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు.
మరో 15 రోజులపాటు పొడిగింపు :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్ ను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది. ఈ ఆఫర్‌ను తొలుత ఆగస్టు 31 వరకు అందుబాటులోకి ఉంటుందని సంస్థ ప్రకటన చేసింది. అయితే తాజాగా ఈ ఆఫర్ గడువును మరో 15 రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రూ.1 రీఛార్జ్ తో :
అంటే సెప్టెంబర్ 15 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఆజాదీ కా ప్లాన్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటి 30 రోజులుగా ఉంటుందని BSNL తెలిపింది. అయితే కొత్తగా సిమ్ కార్డులను కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే రూ.1 ప్లాన్‌ను అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, అందువల్లనే సెప్టెంబర్ 15 వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.
కస్టమర్ సర్వీస్ సెంటర్ లో :
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) ను సందర్శించాలని సూచించింది. అక్కడే KYC పూర్తి చేసి ఉచితంగా సిమ్ కార్డును పొందవచ్చని తెలిపింది. రూ.1 రీఛార్జ్‌తో ఈ ఆజాదీ కా ప్లాన్ యాక్టివేట్ అవుతుందని తెలిపింది. 30 రోజులపాటు ఉచితంగానే అన్ని ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది.
బీఎస్‌ఎన్‌ఎల్ తన యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని BSNL తెలిపింది. ఇదే ధరకు ఇతర నెట్‌వర్క్స్‌లో తక్కువ వ్యాలిడిటీ సహా ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే BSNL మాత్రం మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు చెబుతూ ఇందుకు సంబంధించిన వివరాలను X హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
* BSNL ఇటీవలే రూ.151 BiTV ప్రీమియం ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో OTT సబ్‌స్క్రిప్షన్‌తోపాటు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఈటీవీ విన్, ఆహా, జీ5, సోనిలివ్, ఎపిక్ ఆన్, Sun Nxt, డిస్కవరీ ప్లస్, లైన్స్‌గేట్, Shemaroo వంటి 25 పైగా ఓటీటీలను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా 450 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. BiTV మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీపై BSNL ప్రకటన చేయలేదు. అయితే 30 రోజులపాటు వ్యాలిడిటీ అందిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








