BSNL పండగ సీజన్ ఆఫర్.. ఈ ప్లాన్‌పై ఏకంగా రూ.100 తగ్గింపు.. పూర్తి వివరాలు..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL పండుగల సీజన్ సందర్భంగా (BSNL Festive bonanza 2024) కీలక ప్రకటన చేసింది. నవరాత్రి- దీపావళి పండుగల సందర్భంగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో BSNL హవా కొనుసాగుతోంది. భారత్ ఫైబర్ పేరుతో BSNL బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. బేసిక్ ప్లాన్ ధరపై రూ.100 తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక X (ట్విట్టర్) ద్వారా ఈ ప్రకటన చేసింది.
భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్ (BSNL Fibre Basic Plan) ప్రస్తుత ధర రూ.499 గా ఉంది. పండుగల సీజన్ సందర్భంగా రూ.100 తగ్గింపు ధర ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్లాన్ ధర రూ.399 గా ఉంటుంది. దీంతోపాటు GST అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. డిస్కౌంట్‌తోపాటు తొలి నెల సర్వీస్ ఉచితం అని తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ మూడు నెలలపాటు ఉంటుందని తెలిపింది.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ (Bharat Fibre) ప్లాన్‌లు రూ.249తో ప్రారంభమవుతాయి. అయితే ఈ ప్లాన్ గ్రామీణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఇవి కాకుండా రూ.299, రూ.399, రూ.499 ప్లాన్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫైబర్ బేసిక్ ప్లాన్ రూ.399లో (సాధారణ ధర రూ.499) అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 60Mbps వేగంతో 3300GB డేటాను అందిస్తోంది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరకే మెరుగైన సేవలను అందిస్తోంది. స్పీడ్ సహా ఇతర ప్రయోజనాల్లో రాజీలేకుండా పనిచేస్తోంది. టెలికాం సేవల్లో కొంత వెనుకబడి ఉన్న BSNL.. బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో మాత్రం దూసుకెళ్తోంది. అయితే త్వరలో ఇన్‌స్టాలేషన్ ఛార్జీల భారం కూడా తగ్గనుందని తెలుస్తోంది.
#FestiveBonanzaAlert 📢
— BSNL India (@BSNLCorporate) October 9, 2024
This festive season enjoy our Fibre Basic Plan at just ₹399/month, down from ₹499! Plus, get your first month FREE! Limited time offer. T&C apply.
Say ‘Hi’ on WhatsApp at 1800-4444 for more details!#BharatFibre #BSNLFTTH #BSNL #Switch_To_BSNL pic.twitter.com/PLdFxJUc4n
ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా 4G సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా పనిచేస్తోంది. ఇందుకోసం దేశీయంగా టెక్నాలజీని సమకూర్చుకుంది. మరియు దేశవ్యాప్తంగా లక్ష టవర్ల ఏర్పాటుచేస్తోంది. గ్రామీణ సహా లడఖ్ వంటి ప్రాంతాల్లోనూ టవర్లను ఏర్పాటు చేస్తోంది. జూన్ 2025 నాటికి పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు.
దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్ ఛార్జీల పెంపుతో BSNLకు లక్షలాది మంది పోర్టింగ్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా ట్రాయ్ వెల్లడించింది.
ఇటివల BSNL సేవలు, సబ్‌స్ర్కైబర్ల సంఖ్యపై పలువురు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంచనాల కమిటీ సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ మార్కెట్ వాటా 7 పడిపోవడంపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. రానున్న 6 నెలల కాలంలో సేవలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రస్తుతం 54 వేల టవర్లను 4G టెక్నాలజీ అమర్చేందుకు సిద్ధం చేశామని వివరణ ఇచ్చారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








