Disney+ Hotstar ప్రీమియంను ఉచితంగా అందిస్తున్న BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బిఎస్ఎన్ఎల్ ఇండియాలోని చిన్న పట్టణాల నుండి మెట్రో నగరాల వరకు అన్ని ప్రాంతాలలో భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అనేక రకాల ప్లాన్లతో అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ ను వినియోగించే వినియోగదారులు వారు ఎంచుకున్న ప్లాన్లతో పాటుగా కొన్ని ఉచిత మార్గాలను కూడా ఆశిస్తారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ విభిన్న రకాల ప్లాన్ లతో కొన్ని OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలోని OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన డిస్నీ + హాట్‌స్టార్ యొక్క ప్రయోజనంను ఉచితంగా టెల్కో యొక్క ఫైబర్ ప్లాన్‌లు అందిస్తున్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనంతో BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
డిస్నీ + హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులకు టన్నుల కొద్దీ కంటెంట్ ఉంటుంది. ఇందులో సినిమాలు, టీవీ సిరీస్‌లు, ఒరిజినల్స్, న్యూస్ మరియు ఇతర వినోదాత్మక కంటెంట్ లు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ యొక్క రెండు ప్లాన్‌లు వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ OTT సర్వీస్ యొక్క ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తున్నది.

డిస్నీ + హాట్‌స్టార్ VIP
BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులలో ప్రస్తుతం రెండు ప్లాన్‌లు మాత్రమే డిస్నీ + హాట్‌స్టార్ OTT ప్రయోజనంను ఉచితంగా అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌లలో ఒకటి BSNL సూపర్ స్టార్ 300 మరియు సూపర్ స్టార్ 500. ఇందులో గమనించదగ్గ మరొక విషయం ఏమిటంటే ఇతర టెల్కోలు అందించే డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాకు బదులుగా డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని BSNL వినియోగదారులు పొందుతున్నారు. VIP చందా సంవత్సరానికి రూ.399 ఉండగా ప్రీమియం చందా సంవత్సరానికి రూ.1,499 ధర వద్ద లభిస్తుంది.

BSNL సూపర్‌స్టార్ 500 ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్‌స్టార్ 500 ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే దీనిని నెలకు రూ.949 ధర వద్ద పొందవచ్చు. ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు 50Mbps వేగంతో కస్టమర్‌కు 500GB FUP ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నారు. FUP డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వినియోగదారులకు ఇంటర్నెట్ వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ తో పాటు ల్యాండ్‌లైన్ సేవతో అపరిమిత కాలింగ్ ప్రయోజనం అదనంగా లభిస్తుంది.

BSNL బ్రాడ్‌బ్యాండ్ vs జియో ఫైబర్ టైటానియం ప్లాన్
ఈ ధర పరిధిలోని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని మరే ఇతర టెల్కో అందించడం లేదు. రూ.8,499 ధర వద్ద లభించే టైటానియం ప్లాన్‌తో కూడా జియో ఫైబర్ వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వాన్ని అందిస్తోంది. కాబట్టి వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం ప్రయోజనం కోసం చూస్తున్నవారు బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్లను ఎంచుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








