యూజర్లకు BSNL మరో తీపి కానుక,అపరిమిత సండే ఉచిత కాల్స్ పొడిగింపు

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎన్‌ఎన్‌ఎల్‌) తన సబ్‌స్క్రైబర్లకు మరో తీపి కానుకను అందించింది. క్లోజ్ దిశగా అడుగులు పడుతున్నఆదివారం ఉచిత వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్‌ను పొడిగించింది. ల్యాండ్‌లైన్‌కు, కోంబోకు, ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు 2016 నుంచి అందిస్తున్న ఈ ప్రయోజనాలను మరోసారి పొడిగిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈ సండే కాల్స్‌ ఆఫర్‌ను క్లోజ్‌ చేయాలని గత జనవరిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. కానీ ఫిబ్రవరిలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మరో మూడు నెలల పాటు ఈ ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది.

 

మార్కెట్లోకి స్టార్ట్రాన్‌ 2-in-1 ల్యాపీలు, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండిమార్కెట్లోకి స్టార్ట్రాన్‌ 2-in-1 ల్యాపీలు, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ఎంతకాలం పాటు..

ఎంతకాలం పాటు..

దీని ప్రకారం ఏప్రిల్‌ 30తో ఈ ఆఫర్‌ ప్రయోజనాల గడువు పూర్తి కాబోతోంది.అయితే ప్రస్తుతం మరోసారి ఈ ఆఫర్‌ను మే 1 నుంచి పొడిగించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. అయితే ఎంతకాలం పాటు ఈ ప్రయోజనాలను అందించనున్నదో తెలుపలేదు.

ఆదివారం రోజు ఉచితం

ఆదివారం రోజు ఉచితం

తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఈ ఉచిత కాలింగ్‌ ప్రయోజనాలను బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్లు పొందవచ్చు. ఈ ఆఫర్‌ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లు ఆదివారం రోజు ఉచితంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు.

సమయాల మార్పు
 

సమయాల మార్పు

ఆదివారం ఉచిత కాలింగ్‌ ఆఫర్‌ను పొడిగించడమే కాకుండా.. రాత్రి పూట అందించే వాయిస్‌ కాలింగ్‌ సమయాలను మార్చింది. అంతకముందు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందించే వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని ప్రస్తుతం రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6 గంటలకు మార్చింది.

తీవ్ర పోటీ నెలకొనడంతో..

తీవ్ర పోటీ నెలకొనడంతో..

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. కాగా ఇటీవల ప్రైవేట్‌ టెలికాం కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల ప్రారంభంలో..

ఈ నెల ప్రారంభంలో..

ఈ నెల ప్రారంభంలో కూడా రూ.349తో డేటా, వాయిస్‌ కాలింగ్‌తో కొత్త ప్రీపెయిడ్ మొబైల్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. అదనంగా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలతో రూ.99, రూ.319 ప్లాన్లను ప్రవేశపెట్టింది.

 

 

Best Mobiles in India

English summary
BSNL Free Sunday Calls Offer for Landline and Broadband Users Extended Again More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X