BSNL యూజర్లకు షాక్, సండే ఉచిత కాల్స్ రద్దు !

దేశీయ టెలికాం రంగంలో ఇప్పుడిప్పుడే జియోతో పోటీ పడుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL యూజర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో ఇప్పుడిప్పుడే జియోతో పోటీ పడుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL యూజర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటిదాకా ల్యాండ్‌లైన్లకు అందిస్తున్న ఉచిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను ఫిబ్రవరి 1 నుంచి రద్దు చేయబోతుంది. రాత్రిపూట అందించే ఉచిత కాలింగ్‌ ప్రయోజనాలను నిరోధించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రకటన చేసింది. ఈ ప్లాన్ కాకుండా మరో ప్లాన్ దీని స్థానంలో ప్రవేశపెట్టేందుకు బిఎస్ఎన్ఎల్ కసరత్తు చేస్తుందని సమాచారం.

 

జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా, అయితే స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా !జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా, అయితే స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా !

ఆదివారం ఉచిత కాలింగ్‌ ప్రయోజనాన్ని..

ఆదివారం ఉచిత కాలింగ్‌ ప్రయోజనాన్ని..

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి ఆదివారం ఉచిత కాలింగ్‌ ప్రయోజనాన్ని విత్‌డ్రా చేసుకోబోతుంది. అయితే కలకత్తా టెలిఫోన్స్‌ నుంచి, మా వినియోగదారులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రణాళికలపై పని చేస్తున్నామని కల్‌కత్తా టెలిఫోన్స్‌(కాల్‌టెల్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌పీ తిరపతి చెప్పారు.

రద్దు చేసిన తర్వాత..

రద్దు చేసిన తర్వాత..

ఉచిత వాయిస్ కాల్స్ ను రద్దు చేసిన తర్వాత వారంలో సాధారణ రోజుల మాదిరిగా.. ల్యాండ్‌లైన్‌, కోంబో, ఎఫ్‌టీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై ఆదివారం రోజూ కస్టమర్లకు ఛార్జీలు విధించనున్నామని ఆయన తెలిపారు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.

జనవరి మధ్యలోనే..
 

జనవరి మధ్యలోనే..

కాగా జనవరి మధ్యలోనే రాత్రిపూట ఆఫర్‌ చేసే కాలింగ్‌ స్కీమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ సమీక్షించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటల నుంచి ఉచిత కాల్స్‌ ఆఫర్‌ చేసే బదులు రాత్రి 10.30 గంటల నుంచి ఆఫర్‌ చేయడం ప్రారంభించిందని కాల్‌టెల్‌ టెక్నికల్‌ సెక్రటరీ సీజీఎం గౌతమ్‌ చక్రబోర్టి చెప్పారు.

2016 ఆగస్టు 21న ..

2016 ఆగస్టు 21న ..

2016 ఆగస్టు 21న ఆదివారం ఉచిత కాలింగ్‌ ప్రయోజనాన్ని, రాత్రి ఉచిత కాలింగ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టింది.కాగా దీనిపై బిఎస్ఎన్ఎల్ నుంచి మరింత సమాచారం రావాల్సి ఉంది. కలకత్తా టెలిఫోన్ ప్రస్తుతం ఆరు లక్షల ఫిక్స్ డ్ ల్యాండ్ లైన్ల కనెక్షన్లను కలిగిఉంది. అలాగే BSNL దేశ వ్యాప్తంగా 12 మిలియన్ కనెక్షన్స్ ను కలిగిఉంది.

ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా..

ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా..

ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా జీఎస్ఎం ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎస్‌టీవీ (స్పెషల్ టారిఫ్ వోచర్) ఆఫర్‌లో రూ. 187 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్ పొందాలనుకునే బీఎస్ఎన్ఎల్ వినియోగ దారులు రూ.187తో రీచార్జ్ చేసుకుంటే చాలు.. నెలపాటు 1జీబీ వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమితి కాలం కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది.

 WWW.BSNL.CO.IN ..

WWW.BSNL.CO.IN ..

బీఎస్‌ఎన్ఎల్ తమ అధికారిక వెబ్‌సైట్‌ WWW.BSNL.CO.IN ఈ ఆఫర్ వివరాలను పొందుపరిచింది. జీఎస్‌ఎం ప్రీపెయిడ్ ప్యాక్ లేదా ఎస్‌టీవీ ఆఫర్‌లో ద్వారా ఈ అన్‌లిమిటెడ్ డేటాను 1జీబీ వరకు పొందవచ్చు. అయితే 1జీబీ డేటా దాటిన తరువాత డేటా స్పీడ్ కాస్త 40 కెబీపీఎస్‌కు తగ్గిపోతుంది. రూ.187 రీచార్జ్ ప్యాక్‌లో 1జీబీ డేటాతో పాటుగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్/ఎస్టీడీ)ను అందిస్తోంది.

అన్ని టెలికం ఆపరేట్ నెంబర్లకు..

అన్ని టెలికం ఆపరేట్ నెంబర్లకు..

ఈ కాల్స్‌ను అన్ని టెలికం ఆపరేట్ నెంబర్లకు చేయవచ్చనని తెలిపింది. అందులో ఇతర నెట్‌వర్క్‌లతో పాటుగా బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు కూడా 28 రోజుల పరిమితకాలంలోపు నెట్ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ నేషనల్ రోమింగ్ ప్రాంతాలైన ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు కూడా కాల్స్ చేసుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
BSNL Free Sunday Calls to Be Shut Down on February 1 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X