Home
News

యూజర్లకు మరో గిఫ్ట్, ఆ ఉచిత కాల్స్ మరో మూడు నెలలు పొడిగింపు !

గత వారం బిఎస్ఎన్ఎల్ సండే కాల్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది.

By Hazarath

గత వారం బిఎస్ఎన్ఎల్ సండే కాల్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ రద్దు చేసిన ఈ సండే కాల్స్ ని మరో మూడు నెలల పాటు పొడిగించింది. వినియోగదారుల నుంచి ఈ విషయంపై నిరాశ వ్యక్తమవుతుండటంతో BSNL త నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా 2016 నుంచి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, combo, and FTTH broadband యూజర్లకు సండే ఫ్రీకాల్స్ ను ఇస్తున్న సంగతి విదితమే. ఈ కాల్స్ స్టార్టింగ్ లో 9pm to 7am ఉండగా దాన్ని తరువాత 10.30pm to 6.30amకు మార్చింది. కాగా కంపెనీ నుంచి కొత్త ప్లాన్లు వస్తున్నందున ఈ సండే ఉచిత కాల్స్ రద్దు చేశామని..అయితే వినియోగదారుల ఆసక్తి దృష్యా మళ్లీ ప్రవేశపెట్టామని BSNL's Kolkata unit Chief General Manager of Calcutta Telephones (CalTel) SP Tripathi PTIకి తెలిపారు.

రూ. 429 ప్లాన్

రూ. 429 ప్లాన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వినియోగదారుల కోసం 429 రూపాయలతో ఆకర్షణీయమైన వాయిస్‌, డేటా ఆధారిత ప్లాన్‌ఇది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు.

రూ.186 ప్లాన్..

రూ.186 ప్లాన్..

రూ.186 ప్లాన్ ద్వారా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. 1జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. అయితే ఈ ప్లాన్‌లో లభించే డేటాకు మాత్రం కేవలం 28 రోజుల వాలిడిటీని మాత్రమే ఇస్తున్నారు.

రూ.187 ప్లాన్‌

రూ.187 ప్లాన్‌

అదేవిధంగా రూ.187 ప్లాన్‌లో డేటా ఏమీ లభించదు. కాకపోతే ఇందులో ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ పెట్టుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఉచిత రోమింగ్, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి.

రూ.485 ప్లాన్‌

రూ.485 ప్లాన్‌

రూ.485 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాకు 90 రోజుల వాలిడిటీ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులుగా ఉంది.

STV

STV

STV-333
STV-333తో రీఛార్జ్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జిబి డేటా చొప్పున అన్ లిమిటెడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ కొత్త కష్టమర్లు అలాగే పాతకష్టమర్లు ఉపయోగించుకోవచ్చు
STV349
ఇందులో STV349 Dhil Khol Ke Bol ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL కాల్స్ అపరిమితం.
STV395
STV395 Nehle per Dehla ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. 71 రోజులు వ్యాలిడిటీ.

Best Mobiles in India

English summary
BSNL Free Sunday Calls to Continue for Another Three Months More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X