దిగ్గజాలకు షాకిస్తున్న BSNL, వచ్చే ఏడాది నుంచే 5G సర్వీసులు !

|

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL దేశంలో దిగ్గజాలకు షాకిచ్చేందుకు రెడీ అయింది. అలాగే తమ యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వచ్చే ఏడాది 5జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇప్పటికీ ఇంకా 4జీ సేవలు లేవు. కేరళలో తప్ప దేశంలో అన్ని ప్రాంతాల్లో ఆ సంస్థకు చెందిన 3జీ సేవలు మాత్రమే లభిస్తున్నాయి. అయితే ఈ ఏడాది చివరి వరకు ఢిల్లీ, ముంబై తప్ప దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ 4జీ సేవలను ప్రారంభిస్తామని, అందుకు గాను ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు.

 

ఇకపై మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు షురూ !ఇకపై మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు షురూ !

దిగ్గజాలకు షాకిస్తున్న BSNL, వచ్చే ఏడాది నుంచే 5G సర్వీసులు !

ఇక వచ్చే ఏడాదిలో 5జీ సేవలను ప్రారంభిస్తామని అన్నారు. ఇందుకు గాను నోకియా, జడ్‌టీఈ, ఎన్‌టీటీ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాదికల్లా 1 లక్ష వరకు వైఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. దీంతో సంస్థకు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

దీనితో పాటు తమ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం రూ.499 ప్లాన్ లాంచ్ చేసింది. రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తరువాత ఇది మరో ప్లాన్. ఈ ప్లాన్లో యూజర్లు 45 జిబి డేటాతో పాటు 100 ఎసెమ్మెస్ లు పొందుతారు. ఈ ఫ్లాన్లో యూజర్లకు జీఎస్టీ ఛార్జీలు ఉండవని కంపెనీ తెలిపింది. కాగా రూ. 399 ప్లాన్లో కేవలం 30 జిబి డేటా మాత్రమే లభించేది. అదనంగా 15 జిబి డేటాను ఈ ప్లాన్ ద్వారా యూజర్లు పొందేందుకు అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
We are readying rollout of 5G services, says Anupam Shrivastava More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X