‘డబ్బు వాపస్ ప్లీజ్’

Posted By: Super

‘డబ్బు వాపస్ ప్లీజ్’

 

న్యూఢిల్లీ: తమ పరిధిలో ఉన్న బ్రాడ్‌‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సిస్ (బీడబ్ల్యూఏ) స్పెక్ట్రమ్‌ను వాపసు తీసుకోవాలని, ఇందుకుగాను తాము వెచ్చించిన రూ.8,313.9 కోట్లను తిరిగి చెల్లించాలని బీఎస్ఎన్ఎల్ కోరినట్లు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి మిలిండ్ డియోరా తెలిపారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్‌కు 20 సర్కిళ్లలో బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్‌ ఉంది. ఈ క్రమంలో రెండు ప్రతిపాదనలతో కూడిన లేఖను, ఈ టెలికాం దిగ్గజం ప్రభత్వం ముందుంచినట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో మొదటి ప్రతిపాదన మొత్తం 20 సర్కిళ్లలో తమకు కేటాయించిన 2.5-2.69 బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్‌ను తిరిగిచ్చేయడం ద్వారా రూ. 8,313.9 కోట్లను తిరిగి పొందడం కాగా, ఆరు రాష్ట్రాలలో బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్‌ను వాపస్ ఇచ్చేసి తద్వారా రూ. 6,742.5 కోట్లను పొందాలన్నది రెండవ ప్రతిపాదన. రెండవ ప్రతిపాదనలో భాగంగా వాపస్ ఇచ్చేసే ఆరు సర్కిళ్లలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, మహారాష్ట్ర, గుజరాత్, కోల్‌కతా, కర్ణాటక, తమిళనాడులు ఉన్నాయి. ప్రామిణికం కాని స్పెక్ట్రమ్‌ను కేటాయించారనే ఉద్దేశ్యంతోనే బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీఎస్ఎన్ఎల్ పెంటా టీ-ప్యాడ్ WS802C టాబ్లెట్ కంప్యూటర్ ఫీచర్లు:

8 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా, 4జీబి ఫ్లాష్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్, యూఎస్బీ, వై-ఫై (802.11 b/g), బ్లూటూత్, జీపీఆర్ఎస్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, సిమ్ కార్ట్ స్లాట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, స్పీకర్స్, ఆడియో జాక్, స్టాండర్డ్ లితియమ్ పాలీమర్ 3000mAh బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot