BSNL యూజర్లకు హోలీ ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ.. కొన్నిరోజులు మాత్రమే
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL హోలీ సందర్భంగా యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోన్నట్లు తెలిపింది. మార్చి 1 నుంచి మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. X హ్యాండిల్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
ఈ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ :
హోలీ సందర్భంగా BSNL తన రూ.997 రీఛార్జ్ ప్లాన్‌లో అదనంగా 14 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈ ప్రయోజనాలను పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది.

మొత్తంగా 164 రోజుల వ్యాలిడిటీ :
దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులుగా ఉండగా.. హోలీ సందర్భంగా 14 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది. అంటే మొత్తంగా 164 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.
ఏకంగా 328GB డేటా :
BSNL ప్రీపెయిడ్ యూజర్లు ఈ ప్లాన్‌లో మొత్తంగా 328GB డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈనెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. BSNL యాప్, వెబ్‌సైట్‌తోపాటు ఇతర థర్డ్‌పార్టీ యాప్స్ లో రూ.997 రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.
Rang barse… connection na tarse…
— BSNL India (@BSNLCorporate) March 1, 2026
This Holi, celebrations get a colourful upgrade with the special festive offer from BSNL — now with 14 Days EXTRA Validity.
* ₹997
* 2GB Data Per Day
* Unlimited Calls
* 150 + 14 Days Validity
* Valid from 1st March till 31st March 2026… pic.twitter.com/oWIbNv3aJP
గత సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన BSNL.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వీలుగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయాలని, నెట్‌వర్క్ సమస్యలు తొలగించాలని భావిస్తోంది. దీంతోపాటు నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో వైఫై వినియోగించి వాయిస్ కాల్స్ చేసుకొనే విధంగా VoWiFi సర్వీసులను ఇటీవలే ప్రారంభించింది.
క్రికెట్ సీజన్ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రూ.16 రీఛార్జ్‌పై డబుల్ డేటాను అందిస్తామని చెప్పింది. రూ.16 డేటా బూస్టర్ ప్లాన్‌పై 2GB డేటా మాత్రమే అందిస్తుండగా.. క్రికెట్ సీజన్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనే వివరాలు వెల్లడి కాలేదు.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.485 రీఛార్జ్ ప్లాన్ :
రూ.485 రీఛార్జ్ ప్లాన్ లో (BSNL Rs485 Recharge plan) భాగంగా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.599 రీఛార్జ్ ప్లాన్ :
రూ.599 రీఛార్జ్ ప్లాన్ లో (BSNL Rs599 Recharge plan) అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








