ఫిబ్రవరి 1 నుంచి రెట్టింపు వేగంతో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

Posted By:

రెట్టింపు వేగంతో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

ల్యాండ్‌లైన్ కనెక్షన్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పొందుతున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. వినియోగదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెపైనే రెట్టింపు వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఫిబ్రవరి 2014 నుంచి అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

రెట్టింపు వేగంతో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

ఈ సౌకర్యం అందుబాటులోకి రావటం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకుంటున్న యూజర్లు తక్కువ అద్దెతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను పొందేక్రమంలో ఏడాది అద్దెను ముందుగానే చెల్లించినట్లయితే ఇన్‌స్టలేషన్ ఛార్జీులు ఉండవని బీఎస్ఎనల్ వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని వినియోగదారుల కోసం పూర్తి టాక్‌టైమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పూర్తి టాక్‌టైమ్ ప్లాన్‌లో భాగంగా రూ.60 ఈజీ రీచార్జ్ పై లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కూడిన రూ.70 విలువ చేసే టాక్‌టైమ్‌ను వినియోగదారుడు ఆస్వాదించవచ్చు. ఈ తరహా రీచార్జ్‌ను ఎయిర్‌సెల్ ఇప్పటి వరకు ఏ ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయలేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆర్‌‍సీ 60 పూర్తి టాక్‍‌టైమ్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.30, రూ.40, రూ.50, రూ.60, రూ.100, రూ.149 రీఛార్జుల పైనా పూర్తి టాక్‌టైమ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఎయిర్‌సెల్ పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot