BSNL నుంచి రూ.275 తో 75 రోజుల వ్యాలిడిటీతో అద్భుత‌మైన ఆఫ‌ర్‌!

|

భారత ప్ర‌భుత్వ రంగ టెల్కో భార‌త్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవ సంద‌ర్భంగా అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. కేవ‌లం రూ.275కే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 75 రోజుల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే, ఈ ఆఫర్ కంపెనీ అందించే ప్రతి ప్లాన్‌కు వర్తించదనే విష‌యాన్ని యూజ‌ర్లు గమ‌నించ‌వ‌ల‌సి ఉంటుంది.

 
BSNL నుంచి రూ.275 తో 75 రోజుల వ్యాలిడిటీతో అద్భుత‌మైన ఆఫ‌ర్‌!

స్వాతంత్య్ర దినోత్సవం 2022 సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన ఈ రూ.275 ఆఫ‌ర్‌ కోసం BSNL త‌మ సంస్థ నుంచి ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న మూడు ప్లాన్ల‌ను ఎంపిక చేసింది. వాటిలో రూ. 449, రూ. 599 మరియు రూ. 999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ మూడు ప్లాన్ల‌కు ఈ BSNL భారత్ ఫైబర్ స్వాతంత్ర్య దినోత్సవం 2022 రూ.275 ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. మీకు ఈ ఆఫ‌ర్ న‌చ్చిన‌ట్ల‌యితే ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు మీకోసం అందిస్తున్నాం.. ఈ ఆర్టిక‌ల్ మొత్తం చ‌ద‌వండి.

రూ.449 మరియు రూ.599 ప్లాన్‌లకు BSNL స్వాతంత్య్ర  దినోత్సవ ఆఫర్:

రూ.449 మరియు రూ.599 ప్లాన్‌లకు BSNL స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్:

BSNL స్వాతంత్య్ర దినోత్స‌వ ఆఫ‌ర్‌లో భాగంగా రూ.449 మరియు రూ.599 ప్లాన్‌లను కేవ‌లం రూ.275 అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ రెండు ప్లాన్లు వినియోగ‌దారులు రూ.275 చెల్లించి, 75 రోజుల పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల్ని పొంద‌వ‌చ్చు. స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌తో లభించే తగ్గింపు ధర కింద ప్రయోజనాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్ర‌యోజ‌నాలు య‌థావిథిగా ఉంటాయి.

రూ.999 ప్లాన్ కోసం BSNL స్వాతంత్య్ర  దినోత్సవ ఆఫర్:

రూ.999 ప్లాన్ కోసం BSNL స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్:

BSNL రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇండిపెండెన్స్ డే ఆఫర్ లో భాగంగా కేవ‌లం రూ.775కి 75 రోజుల పాటు అందించనుంది. ఇది కంపెనీ అందించే ప్రీమియం ప్లాన్‌లలో ఒకటి. అంతేకాకుండా, ఈ ప్లాన్‌కు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలు ఉన్న‌ కారణంగా ఇది వినియోగదారులకు ఒక ప్ర‌త్యేక‌మైన ఎంపికగా ఉంది. ఇప్పుడు ఈ మూడు ప్లాన్‌లకు కంపెనీ అందిస్తున్న ప్ర‌యోజ‌నాల‌పై ఓ లుక్కేద్దాం.

BSNL భారత్ ఫైబర్ రూ. 449, రూ. 599 మరియు రూ. 999 ప్లాన్ ఆఫర్‌లు:
 

BSNL భారత్ ఫైబర్ రూ. 449, రూ. 599 మరియు రూ. 999 ప్లాన్ ఆఫర్‌లు:

BSNL తన రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 30 Mbps వేగంతో అందిస్తోంది. వినియోగదారులు 3.3TB నెలవారీ డేటాను పొందుతారు, నిర్ణీత డేటా పూర్త‌య్యాక‌ ఇంటర్నెట్ వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇక‌ రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో, వినియోగదారులు 3.3TB వరకు నెలవారీ డేటాతో 60 Mbps స్పీడ్‌ని పొందుతారు, ఆ తర్వాత నిర్ణీత డేటా పూర్త‌య్యాక‌ ఇంటర్నెట్ వేగం 2 Mbpsకి పడిపోతుంది. చివరగా, రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో, వినియోగదారులు 2TB డేటాతో 150 Mbps వేగాన్ని పొందుతారు. అయితే ఉచిత Dinsey+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, Hungama, SonyLIV, ZEE5, Voot, YuppTV మరియు Lionsgate వంటి OTT ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్ప‌టికే BSNL సంస్థ అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా రూ.2022 పేరుతో ప్రీపెయిడ్ ప్లాన్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.. దాని గురించి కూడా తెలుసుకుందాం:

ఇప్ప‌టికే BSNL సంస్థ అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా రూ.2022 పేరుతో ప్రీపెయిడ్ ప్లాన్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.. దాని గురించి కూడా తెలుసుకుందాం:

బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చిన ఈ రూ.2022 ప్లాన్ లాంగ్ ట‌ర్మ్ వ్యాలిడిటీ ప్లాన్‌. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మరియు సేవ‌లు 300 రోజులు ఉంటాయి. ఈ ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజ‌ర్లు ప్రతి నెలా 76జీబీల డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ప‌లు అప‌రిమిత ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

ఈ రూ.2022 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 మెసేజ్ సేవ‌ల‌ను కూడా పొందొచ్చు. నెల‌లో 75జీబీల డేటా వినియోగం పూర్తి అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. అయితే, ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. డేటా మొద‌టి 60 రోజులు మాత్ర‌మే వ‌స్తుంది. ఆ త‌ర్వాత మీరు డేటా కావాలంటే.. డేటా వోచ‌ర్స్‌ను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగ‌స్టు 31 వ‌ర‌కు అందుబాటులో:

ఆగ‌స్టు 31 వ‌ర‌కు అందుబాటులో:

ఇది AzadiKaAmritMahotsavPV_2022 సంద‌ర్భంగా ఆఫర్‌గా BSNL ద్వారా ప్రారంభించబడిన ఆసక్తికరమైన డేటా వోచర్. ఈ ఆఫర్ ఆగస్టు 31, 2022 వరకు అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఈ వోచర్‌ని పొందాలనుకుంటే, ఈ నెలలోనే దీన్ని రీఛార్జీ చేయండి. మీరు మీ ప్రాంతంలో BSNL నుండి అంత‌రాయాలు లేని నెట్‌వర్క్ సేవలను పొందుతున్నట్లయితే, ఇది మీకు అద్భుతమైన దీర్ఘకాలిక భాగస్వామిగా నిరూపించబడుతుంది.

 

Best Mobiles in India

English summary
BSNL Independence Day 2022 Offer: Get 75 Days of Broadband Service at Rs 275

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X