Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. దేశవ్యాప్తంగా 84 వేల 4G టవర్ల ఏర్పాటు.. మీకు లాభమేంటో తెలుసా..?

BSNL 4G Towers : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు గత సంవత్సరం రెండు భాగం బాగా కలిసి వచ్చింది. దీంతో సుమారు 17 సంవత్సరాల తర్వాత లాభాల బాట పట్టింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గత సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా సంస్థ భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపారు. ఫలితంగా భారీ స్థాయిలో యూజర్లు వచ్చి చేరారు.

దేశవ్యాప్తంగా లక్ష టవర్లు :
అయితే BSNL లో నెట్‌వర్క్‌, తక్కువ ఇంటర్నెట్‌ వేగం, కాల్‌ డ్రాప్‌ సహా ఇతర సమస్యల కారణంగా చాలా మంది యూజర్లు తిరిగి BSNL నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అయ్యారు. అయితే సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది.

BSNL installed 84000 4G towers

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో :
ఇందులో భాగంగా ఇప్పటి వరకు 84 వేలకు పైగా బీఎస్ఎన్‌ఎల్‌ 4G టవర్లను ఇన్‌స్టాల్‌ చేసింది. మిగిలిన టవర్ల ఏర్పాటు వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టెక్నాలజీని సమకూర్చుకుంది. అయితే 4G నెట్‌వర్క్ ఈ రెండు నెలల్లోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

5G నెట్‌వర్క్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే? :
దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చాక.. 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించాలని భావిస్తోంది. జూన్ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. TCS భాగస్వామ్యంతో దేశీయంగా 4G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.

5G ఎక్కడ ప్రారంభం కానుంది? :
BSNL 5G గురించి ఇది వరకే అనేక వివరాలు వెల్లడయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అనంతరం క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపింది. BSNL 4G, 5G నెట్‌వర్క్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. అనేక మంది యూజర్లు ప్రభుత్వ రంగ సంస్థ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.

రేపే లాస్ట్‌ డేట్‌ :
తక్కువ ధరకు రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులోకి ఉండడం సహా మారుమూల ప్రాంతాల్లోనూ BSNL నెట్‌వర్క్‌ను అందించనుంది. ఇటీవలే మదర్స్‌ డే సందర్భంగా ఎంపిక చేసిన ప్లాన్‌లపై వ్యాలిడిటీ పెంపు, 5 శాతం డిస్కౌంట్‌ను అందించింది. ఈ ఆఫర్‌ 7 వ తేదీన ప్రారంభం కాగా.. మార్చి 14 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. అయితే మరో ప్రముఖ సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) తొలిసారిగా ముంబైలో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ స్టేడియంలలోనూ Vi 5G నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేసింది. అనంతరం పాట్నా, చండీగడ్‌ నగరాల్లోనూ 5G సర్వీసులను ప్రారంభించింది. రానున్న మూడు సంవత్సరాల్లో 100 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL installed 84000 4G towers across in india and 5g services may launch in june
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X