జీవితాంతం ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ ఆఫర్?

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్, ఫ్రీ లైఫ్ టైమ్ వాయిస్ కాల్స్ ఆఫర్‌‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

జీవితాంతం ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్  ఆఫర్?

ఈ ఆఫర్‌తో పాటుగా ఉచిత వై-ఫై హాట్‌స్పాట్ జోన్‌లను కూడా బీఎస్ఎన్ఎల్ నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. జియోకు చెక్ పెట్టే క్రమంలో ఆకర్షణీయమైన ఆఫర్లతో చురుకుగా పావులు కదపుతోన్న బీఎస్ఎన్ఎల్ ఇతర ఆపరేటర్లకు సైతం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

Read More : రద్దైన పెద్ద నోట్లతో మొబైల్ ఫోన్స్ కొనేందుకు ఛాన్స్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రీ లైఫ్ టైమ్ వాయిస్ కాల్స్...

బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోయే ఫ్రీ లైఫ్ టైమ్ వాయిస్ కాల్స్ ఆఫర్‌ను 2017 ఆరంభంలో మార్కెట్లో లాంచ్ చేస్తామని బీఎస్ఎన్ఎల్ ఇటీవల వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మిగిలిన టెలికం ఆపరేటర్లకు మింగుడపడటంలేదనే చెప్పాలి.

ఫ్రీడమ్ ప్లాన్ పేరుతో...

"Freedom Plan" పేరుతో సరికొత్త స్కీమ్‌0ను బీఎస్ఎన్ఎల్ ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.136 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాల పాటు కాల్‌కు రూ.25 పైసలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 1జీబి ఉచిత డేటాను కూడా యూజర్ పొందగలుగుతారు. డేటా వాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు మాత్రమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సండే కాలింగ్ ఆఫర్‌...

బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన యూజర్ల కోసం ఉచిత సండే కాలింగ్ ఆఫర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ చందాదారులు ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ డిజిటల్ అవుతోంది..

కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను పొందే యూజర్లు ఇక పై యాక్టివేషన్ నిమిత్తం రోజుల తరబడి వెయిట్ చేయవల్సిన అవసరం ఉండదు. నిమిషాల్లోనే యాక్టివేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంటుంది. డిజిటల్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయ్యే యోచనలో ఉన్న త్వరలో బయోమెట్రిక్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త వెరిఫికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి వచ్చినట్లయితే, మీ ఆధార్ కార్డ్ ఇంకా మీ వేలిముద్రతో సిమ్ యాక్టివేషన్ ప్రాసెస్ విజయవంతమవుతుంది.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌ జోన్స్...

TelecomTalk.Info రిపోర్ట్స్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ త్వరలో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌ జోన్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు వీటిని ఉపయోగించుకుని పబ్లిక్ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to Introduce Free Lifetime Voice Calls in 2017, Aims to be the Best Network. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot