రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

రిలయన్స్ జియో ధన్ దనా ధన్ ఆఫర్‌కు పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL మూడు కొత్త ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చిన STV339 ప్లాన్‌ను కూడా మాడిఫై చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ పై ఇక నుంచి రోజుకు 2జీబి డేటాకు బదులు 3జీబి డేటాను పొందే వీలుంటుంది. ఏప్రిల్ 24 నుంచి ఈ సవరణ వర్తిస్తుంది.

Read More : USB Type-C గురించి 5 ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ప్లాన్‌ల వివరాలు..

బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న కొత్త ప్లాన్‌ల వివరాలు.. , దిల్ కోల్ కి బోల్ (STV349), ట్రిపుల్ ఏస్ (STV333), నెహెల్ పె దేహ్లా (STV395).

దిల్ కోల్ కి బోల్ రూ.349

దిల్ కోల్ కి బోల్ రూ.349 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 28 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందబాటులో ఉంటుంది. అంతేకాకుండా, హోమ్ సర్కిల్ పరిధిలో లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్

ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్

నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. BSNL టు BSNL నెట్‌వర్క్‌ల మధ్య 3000 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌ల మధ్య 1800 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునే వీలుటుంది ప్లాన్ వ్యాలిడిటీ 71 రోజులు (10 వారాలు). ఉచిత టాక్‌టైమ్ పూర్తి అయిన తరువాత నిమిషానికి 20 పైసలు ఛార్జ్ చేస్తారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to Introduce Three New Combo Plans to Counter Private Telcos. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot