రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ (BSNL) మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు ఓ అన్‌లిమిటెడ్ ప్రమోషనల్ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలో లాంచ్ చేయబోబోతోంది.
Read More : 12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో 8 సిమ్ కార్డ్ లను సపోర్ట్ చేసే ఫోన్ వచ్చేస్తోంది!

#1
ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారుడు కేవలం రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు.రిలయన్స్ జియో, 1జీబి ఇంటర్నట్‌ను రూ.50కు ఆఫర్ చేస్తోన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో ముందుకు రావటం విశేషం.

#2
Experience Unlimited BB 249 పేరుతో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సెప్టంబర్ 9 నుంచి అమలులోకి రానుంది.

#3
బృహత్తరమైన ఆలోచనతో తాము లాంచ్ చేయబోతోన్న ఈ ఆఫర్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచటంతో పాటు వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వైపు కొత్త వినియోగదారులను ఆకర్షించిలా చేస్తుందని బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు.

#4
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను 2 Mbps వరకు వేగంతో అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

#5
ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటాను రూపాయి కన్నా తక్కువ మొత్తానికి బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయనుంది.

#6
6 నెలలు పూర్తి అయిన తరువాత కస్టమర్ తన ఛాయిస్‌ను బట్టి రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.

#7
జియో 4జీకి పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే నేషన్‌వైడ్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాంగా రూ.1,099 చెల్లించినట్లయితే 30 రోజుల పాటు 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.

#8
కొన్ని Existing planలకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ డేటా లిమిట్‌ను డబల్ చేసింది. ఉదాహరణకు మీరు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే ఇకనుంచి మీరు 10జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా గతంలో 5జీబి డేటాను మాత్రమే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసేది. అలానే రూ.156 ప్లాన్‌లో ఉన్న యూజర్లు 2జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు మాత్రమే.


Click it and Unblock the Notifications