Home
News

BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 4G రీఛార్జ్‌ ప్లాన్‌లు విడుదల.. ఆగస్టు నుంచే దేశవ్యాప్తంగా 4G సేవలు..!!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి 4G సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకోసం ఇటీవల సుమారు 10000 టవర్లను అప్‌గ్రేడ్‌ చేసింది. ఫలితంగా ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా BSNL తన సోషల్‌ మీడియా ద్వారా 4G సర్వీసులకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. యూట్యూబ్‌ వీడియో ద్వారా 4G రీఛార్జ్‌ ప్లాన్‌ల (BSNL 4G Prepaid Recharge Plans) వివరాలను వెల్లడించింది.

ఈ BSNL 4G ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 4G డేటా సర్వీసులు సహా ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌, మ్యూజిక్‌ వంటి వాల్యూ యాడెడ్‌ సర్వీసులను పొందవచ్చు. ఈ వీడియో ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన 4G నెట్‌వర్క్‌ గురించి వివరించింది. దేశవ్యాప్తంగా త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

BSNL 4G Prepaid recharge plans launched

PV2399 : ఈ BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారి 2GB డేటాను పొందవచ్చు. మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో 790GB డేటాను పొందవచ్చు.

PV1999 : ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 600GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు PV997 ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. 160 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అంటే మొత్తంగా 320GB డేటాను పొందవచ్చు.

STV599 : ఈ BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జీ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు.

STV347 : ఈ BSNL రీఛార్జ్‌ ప్లాన్ గడువు 54 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 108GB డేటాను పొందవచ్చు.

PV199 : ఈ BSNL రీఛార్జీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ గడువు 30 రోజులుగా ఉంది. మొత్తంగా 60GB డేటాను వినియోగించుకోవచ్చు.

PV153 : ఈ ప్లాన్ గడువు 26 రోజులుగా ఉంది. ప్రతి రోజు 1GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు STV118 ప్లాన్‌ ద్వారా 20 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మొత్తంగా 10GB డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL introduced 4G Prepaid recharge plans here is the full list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X