Home
News

BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్: 60 Mbps వేగంతో జియోకు పోటీగా తక్కువ ధరలోనే  

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో జియో ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌లను ఎదురుకోవడానికి ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రారంభిస్తోంది. రూ.499 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకొని PSU రూ.599 ధర వద్ద కొత్తగా 'ఫైబర్ బేసిక్ ప్లస్' ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ 60Mbps వేగంతో అపరిమిత డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఫైబర్-టు-హోమ్ (FTTH) సేవలను అందిస్తున్న అన్ని సర్కిల్‌లలోను ఈ కొత్త ప్లాన్ లభిస్తుంది. ఈ కొత్త ప్లాన్ 2020 నవంబర్ 11 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL యొక్క సరికొత్త ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వినియోగదారులకు 60Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ అపరిమిత డేటాలో 3300GB FUP క్యాప్ ఉంటుంది అని గమనించాలి. ఏదేమైనా ISP ఈ ప్లాన్ ను ప్రత్యర్థి బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ల మాదిరిగానే అపరిమిత డేటా ప్లాన్‌గా మార్కెటింగ్ చేస్తోంది. వినియోగదారులు నెలవారీ FUP పరిమితిని అయిపోయిన తరువాత దీని యొక్క స్పీడ్ 2 Mbps కు తగ్గించబడుతుంది. FUP పరిమితిని దాటిన తర్వాత వినియోగదారులు 2 Mbps వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా అప్‌లోడ్ చేయవచ్చనే దానిపై పరిమితి లేదని గమనించండి.

BSNL రూ.599 బేసిక్ ప్లస్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

BSNL రూ.599 బేసిక్ ప్లస్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

BSNL యొక్క సరికొత్త ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులకు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా 24 గంటల అపరిమిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. అన్ని రకాల పన్నులను మినహాయించిన తరువాత ఈ ప్లాన్ యొక్క నెలవారీ ధర రూ.599 మాత్రమే.  బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతానికి ఈ ప్లాన్‌ను దీర్ఘకాలిక ప్యాకేజీలలో ప్రారంభించలేదు కావున మీరు నెలవారీ ఎంపికను మాత్రమే ఎంచుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్‌తో ISP అందించే OTT సభ్యత్వాల గురించి సరైన సమాధానం ఇంకా పూర్తిగా తెలిదు.

BSNL రూ.449 ఫైబర్ బేసిక్ ప్లాన్‌ ప్రయోజనాలు

BSNL రూ.449 ఫైబర్ బేసిక్ ప్లాన్‌ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ రూ.449 ధర వద్ద అందించే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కూడా ప్రస్తుతం సవరించుకుంటోంది. ఈ ఎంట్రీ లెవల్ ప్లాన్ ఇప్పుడు అండమాన్ & నికోబార్ మినహా అన్ని నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇది 3.3TB వరకు డేటాను 30Mbps వేగంతో అందిస్తుంది. ఇది జియోఫైబర్ యొక్క రూ.399 ప్లాన్‌కు గట్టి పోటీని ఇస్తుంది. కస్టమర్ సబ్‌స్క్రిప్షన్ పొందిన మొదటి ఆరు నెలల తర్వాత రూ.449 ప్లాన్ ధర మార్చబడుతుందని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
BSNL Introduced 60 Mbps Speed New Fiber Basic Plus Plan at Rs.599 Only
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X