BSNL కొత్త త్రైమాసిక పేమెంట్ స్కీమ్!! రీఛార్జ్ లపై అదనపు వాలిడిటీ

|

ప్రభుత్వ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో రూ.499 తక్కువ ధర వద్ద 100GB డేటాను అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇప్పుడు తన యొక్క పోర్ట్ పోలియో నుంచి తొలగించింది. అయితే ఈ ప్లాన్ యొక్క ప్రస్తుత కస్టమర్లు కొనసాగినప్పటికీ టెలికాం ఆపరేటర్ వారిని ఇతర సాధారణ BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ పాన్-ఇండియా ప్లాన్ మొదటిసారిగా మే 2021 ప్రారంభంలో ప్రవేశపెట్టబడింది. ఈ ప్లాన్ వినియోగదారులకు 10 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో 40GB వరకు డేటాను అందించేది. FUP తర్వాత డౌన్‌లోడ్ వేగం 512 Kbps కు తగ్గించబడుతుంది.

BSNL 200GB CUL ఫైబర్ ప్లాన్

BSNL 200GB CUL ఫైబర్ ప్లాన్

BSNL తన యొక్క అన్ని సర్కిల్లలో FTTH ప్లాన్‌ను కూడా అందిస్తోంది. 200GB CUL భారత్ ఫైబర్ CS358గా డబ్ చేయబడిన ఈ ప్లాన్ 200GB వరకు డేటాను 50 Mbps డౌన్‌లోడ్ వేగంతో అందిస్తుంది. తరువాత 200GB పోస్ట్-FUP పరిమితి దాటిన తరువాత డేటాను స్పీడ్ 2 Mbps కి తగ్గించబడి అందిస్తుంది. ఈ ప్లాన్ కోసం స్థిర నెలవారీ అద్దె రూ. 499.

BSNL త్రైమాసిక పేమెంట్ స్కీం

BSNL త్రైమాసిక పేమెంట్ స్కీం

ఇతర పరిణామాలలో BSNL రూ.599, రూ.799 మరియు రూ.999 ధరల వద్ద లభించే ఫైబర్ ప్లాన్‌ల కోసం కొత్త త్రైమాసిక పేమెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. కొత్త పథకం కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్లాన్‌ల కోసం 15 రోజుల పాటు అదనపు చెల్లుబాటును పొందేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు 15 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందడానికి ఈ ఫైబర్ ప్లాన్‌లలో ఒకదానికి మూడు నెలల పాటు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ స్కీమ్ జనవరి 23, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

BSNL ఫైబర్ బేసిక్ ప్లస్

BSNL ఫైబర్ బేసిక్ ప్లస్ రూ.599 ధర వద్ద ఛార్జ్ చేయబడుతుంది. ఇది వినియోగదారులకు 60 Mbps వేగంతో అపరిమిత దేశీయ కాల్‌లతో 3300GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత డేటా స్పీడ్ 2 Mbpsకి తగ్గించబడుతుంది. అలాగే రూ.799 ధర వద్ద లభించే రెండవ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ BSNL ఫైబర్ వాల్యూ ప్యాక్ 3300GB FUP డేటాను 100 Mbps వేగంతో అందిస్తుంది. FUP తర్వాత పరిమితి తరువాత డేటా స్పీడ్ 2 Mbpsకి తగ్గించబడుతుంది.

ఫైబర్ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

చివరిగా రూ.999 ధర వద్ద లభించే BSNL యొక్క ఫైబర్ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 3300GB FUP డేటాను 200 Mbps వేగంతో అందిస్తుంది. ఆ తర్వాత డేటా వేగం 2 Mbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క కస్టమర్‌లు Disney+ Hotstarకి ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. వినియోగదారు ఈ ఫైబర్ ప్లాన్ నుండి వైదొలగితే సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది. అదనంగా, ఈ ప్లాన్‌తో వినియోగదారు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లు అన్ని కూడా ఇప్పుడు 90 రోజుల పాటు ప్రమోషనల్ ప్రాతిపదికన ప్రకటించబడతాయి. ఆ తర్వాత ప్లాన్ పొడిగించబడుతుంది లేదా విస్మరించబడుతుంది.

OTT ప్రయోజనాలతో వచ్చే BSNL ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

OTT ప్రయోజనాలతో వచ్చే BSNL ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

BSNL భారత్ ఫైబర్ అందించే మరో రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు OTT ప్రయోజనాలతో రావడం గమనించదగ్గ విషయం. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ. 999 మరియు రూ. 1499. ఇందులో రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 3.3TB నెలవారీ డేటాను 200 Mbps వేగంతో అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో ఉచిత ఫిక్స్‌డ్-లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం OTT సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనం ఉచితంగా లభిస్తుంది. BSNL అందించే అత్యంత ఖరీదైన నెలవారీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అయిన రూ.1499 ప్లాన్ వినియోగదారులకు 300 Mbps వేగంతో 4TB నెలవారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో అందించే OTT ప్రయోజనం కూడా ఒక సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం. OTT ప్రయోజనాలతో వచ్చే స్టేట్-రన్ టెల్కో యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఏవీ లేవు.

BSNL కొత్త కనెక్షన్ ఆఫర్

BSNL కొత్త కనెక్షన్ ఆఫర్

BSNL యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎంచుకున్న కొత్త కస్టమర్లకు మొదటి నెలలో రూ.500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ను టెల్కో తన యొక్క వెబ్ సైట్ లో ప్రకటించింది. కొత్త BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెళ్లే కస్టమర్‌లు దేశంలోని అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మరియు సర్కిల్‌లలో వారి మొదటి నెల ఛార్జీపై రూ.500 వరకు అంటే 90% తగ్గింపును పొందేందుకు అర్హులు అవుతారు. ఇది ప్రమోషనల్ ఆఫర్ అయినందున ఈ ఆఫర్ 90 రోజుల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా BSNL తన బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్‌కు మరింత మంది కొత్త కస్టమర్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ దీనిని 'దీపావళి ధమాకా ఆఫర్ 2021' పేరుతో పిలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ నవంబర్ 1, 2019 నుండి జనవరి 29, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL Introduced New Quarterly Payment Scheme: Here are Full Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X