BSNL Rs.1,499 లాంగ్-వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్: వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రహ్మాండం
ఇండియాలోని టెలికామ్ రంగంలో ఒకప్పుడు మకుటం లేని రారాజుగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మళ్ళి తన పూర్వ వైభవం సంపాదించుకోవడానికి తన వినియోగదారుల కోసం కొత్తగా PV-1499 అనే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ప్లాన్ యొక్క విషయాన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ 2020 సెప్టెంబర్ 1 నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ PV-1499 ప్లాన్ యొక్క ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ సంస్థ తన కస్టమర్ల కోసం కొత్తగా అందిస్తున్న PV-1499 ప్రీపెయిడ్ ప్లాన్ సెప్టెంబర్ 1, 2020 నుండి వినియోగదారులకు అందుబాటులోకి ఉండబోతోంది. ఇది 365 రోజులు అంటే మొత్తంగా ఒక సంవత్సరం చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మొత్తం వాలిడిటీ కాలంలో 24GB FUP డేటాతో పాటు రోజుకు 100 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంను కూడా అందిస్తుంది. ఈ వాయిస్ కాలింగ్ లో ప్రతిరోజూ 250 నిమిషాల FUP పరిమితిని కలిగి ఉంటుంది అని మాత్రం మరచిపోకండి. FUP నిమిషాల తరువాత కస్టమర్ వాయిస్ కాల్స్ చేయడానికి స్టాండర్డ్ రేటులో వసూలు చేయబడుతుంది.

బిఎస్ఎన్ఎల్ PV-1499 ప్లాన్ ప్రమోషనల్ ఆఫర్
ప్రచార ఆఫర్‌లో భాగంగా లభిస్తున్న ఈ ప్లాన్ ప్రవేశపెట్టిన మొదటి 90 రోజుల్లో రీఛార్జ్ చేసే వ్యక్తులకు మాత్రమే అదనపు ప్రయోజనాలను యాక్సిస్ చేయడానికి అర్హులు అవుతారు. PV-1499 ప్లాన్ 365 రోజులు (1 సంవత్సరం) చెల్లుబాటు ఉంటుంది. కానీ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ప్లాన్ యొక్క అసలు వాలిడిటీ కంటే 30 రోజులు అధికంగా ఉంటుంది. కాబట్టి ప్లాన్ మొత్తం చెల్లుబాటు 395 రోజులు. వినియోగదారులు ఈ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ నుండి పొందవచ్చు లేదా వారి రిజిస్టర్డ్ బిఎస్ఎన్ఎల్ నంబర్ నుండి ‘ప్లాన్ BSNL 1499' టైప్ చేసి 123 కు టెక్స్ట్ మెసేజ్ చేయవచ్చు.

1సంవత్సరం చెల్లుబాటుతో BSNL యొక్క మరిన్ని ప్లాన్‌లు
1సంవత్సరం చెల్లుబాటుతో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్లాన్‌ల జాబితాలో కొత్తగా ప్రవేశించిన తాజా ప్రీపెయిడ్ ప్లాన్ PV-1499. ఈ వాలిడిటీ కాలంతో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరిన్ని ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది PV-365 ప్లాన్. ఇది 365 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా మరియు రోజుకు 250 నిమిషాల అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారి 2GB డేటా వినియోగం తర్వాత దాని యొక్క వేగం 80Kbpsకు తగ్గించబడుతుంది. అలాగే వినియోగదారులకు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ గురించి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని ఉచితాలు మొదటి 60 రోజులు మాత్రమే వస్తాయి. కాబట్టి మొదటి 60 రోజుల ఫ్రీ సర్వీస్ తరువాత కాల్స్ చేయడానికి లేదా డేటాను ఉపయోగించడానికి కస్టమర్ టెల్కో నుండి వాయిస్ మరియు డేటా వోచర్‌లను కొనుగోలు చేయవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








