BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్!!! తక్కువ ధరలో ప్రయోజనాలు అద్భుతం...
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే టెలికామ్ ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ బేస్ ను మరింత పెంచడానికి కొత్త ఆఫర్లను మరియు ప్లాన్ లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది. ఈ టెల్కో అందించే కొన్ని ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్ ల కారణంగా ఇతర టెల్కోలకు కాస్త బిన్నంగా ఉంది. బిఎస్ఎన్ఎల్ సంస్థ దేశం మొత్తం మీద దాని 4G సేవలను ఇంకా ప్రవేశపెట్టలేదు. 4G సేవలను సాధ్యమైనంత వేగంగా తీసుకురావడానికి టెల్కో కృషిచేస్తున్నారు. టెల్కో అందించే ఆసక్తికరమైన ప్లాన్ లలో STV-49 ప్లాన్ కూడా ఉంది. ఇది కొన్ని రోజుల క్రితం ప్రవేశపెట్టింది మరియు పరిమిత సమయం వరకు మాత్రమే అందించబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV-49 ప్లాన్ డేటా ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త STV-49 ప్లాన్ సెప్టెంబర్ 1, 2020 నుండి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇది 90 రోజులు మాత్రమే ఆఫర్ లో లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB డేటా బెనిఫిట్‌తో వస్తుంది. ఈ డేటాతో పాటుగా కస్టమర్ 100 నిమిషాల కాల్స్ ప్రయోజనాన్ని కూడా ఉచితంగా పొందటానికి అర్హులు అవుతారు. దీని తరువాత చేసే కాల్స్ కోసం నిమిషానికి 45 పైసల చొప్పున వసూలు చేయబడతాయి. డేటా మరియు వాయిస్ కాలింగ్‌తో పాటు 100SMS ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ STV-49 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. సెల్ఫ్‌కేర్ కీవర్డ్ - ‘STV COMBO49' ను ఉపయోగించి STV 49 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు vs ఇతర టెల్కోల ప్రీపెయిడ్ ప్లాన్‌లు
బిఎస్ఎన్ఎల్ కొత్తగా అందిస్తున్న STV-49 ప్లాన్ వలె ఇతర టెల్కోలు ఎవరూ ఇలాంటి ప్లాన్ ను అందివ్వడం లేదు. అతి తక్కువ ధర వద్ద 28 రోజుల చెల్లుబాటుతో రావడం మరొక గొప్ప విషయం. డేటాను ఎక్కువగా ఉపయోగించని మరియు అధికంగా ఫోన్ కాల్లను చేయడానికి మాత్రమే ఇష్టపడే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఫోన్ కాల్స్ పరిమితి తరువాత నిమిషానికి 45 పైసల చొప్పున కాల్ చార్జీలు వసూలు చేసినప్పటికీ 28 రోజుల చెల్లుబాటుతో లభించే ఇది ఖరీదైనది కాదు. యూజర్లు తమ బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డును ఎల్లప్పుడూ యాక్టీవ్ లో ఉంచాలనుకునే వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ మంచిది. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు మరియు అత్యవసర పరిస్థితుల్లో కాల్స్ చేయడానికి లేదా అదనపు డేటా అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.

BSNL రూ.100 ధర లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లు
బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు రూ.100 ధర లోపు మరొక రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. జూలైలో రూ.94 మరియు రూ.95 ధర వద్ద ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు ప్రారంభంలో 90 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. తరువాత ప్రీపెయిడ్ వోచర్‌లను ఉపయోగించి వీటిని పొడిగించవచ్చు. ఈ రెండు ప్లాన్‌లు 3GB డేటా బెనిఫిట్ తో మరియు 100 నిమిషాల ఉచిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని హోమ్ నెట్‌వర్క్‌లో ఢిల్లీ మరియు ముంబై సర్కిల్‌లలో రోమింగ్‌లో ఉపయోగించుకోవచ్చు.

BSNL Rs 1499 Plan ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల రూ.1,499 ధర వద్ద మరొక కొత్త వార్షిక ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది రోజుకు 250 నిమిషాల అవుట్‌గోయింగ్ FUP పరిమితితో అపరిమిత ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే రోజుకు 100 SMS ప్రయోజనాలతో పాటు మొత్తం చెల్లుబాటు కాలంలో 24GB డేటాను అందిస్తుంది. వాయిస్ కాల్ FUP వినియోగించిన తరువాత కాల్ చార్జీలు వర్తిస్తాయి.

BSNL Rs 1999 Plan ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్ఎన్ఎల్ సంస్థ 3GB డేటా ప్రయోజనంతో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. కానీ దాని ధరకు తగ్గట్టుగా ఇది 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల FUP పరిమితి అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. రోజువారి 3GB డేటా అయిపోయిన తరువాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం 80 Kbps కి తగ్గించబడుతుంది. దానితో పాటు రోజుకు 100 SMS ప్రయోజనం కూడా ఉంది. లడఖ్, జమ్మూ కాశ్మీర్, మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు మినహా భారతదేశంలోని దాదాపు ప్రతి టెలికం సర్కిల్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








