Home
News

BSNL లిమిటెడ్‌ టైం రీఛార్జ్‌ ప్లాన్‌.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 2GB డేటాతో ఏకంగా 60 రోజుల వ్యాలిడిటీ..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల దూసుకెళ్తోంది. ఈ సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా (VI) రీఛార్జ్ ధరలు పెంచాక.. అనేక మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్ నెలల్లో లక్షలాది మంది యూజర్లు BSNL నెట్‌వర్క్‌లో చేరారు. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొనేందుకు వీలుగా BSNL అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

శరవేగంగా BSNL 4G టవర్ల ఏర్పాటు :
ఇతర సంస్థలతో పోలిస్తే భారీ తక్కువ ధరకు రీఛార్జ్‌ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. దీంతోపాటు 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా 4G టవర్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికి 60 వేలకు పైగా టవర్లను సిద్ధం చేసింది. 2025 మే నాటికి లక్ష టవర్లను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 4G సేవలను అందుబాటులోకి (BSNL New Year 2025 Recharge Plan) తీసుకురావాలని భావిస్తోంది.

BSNL new limited time recharge plan with RS277

బీఎస్‌ఎన్‌ఎల్‌ న్యూ ఇయర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ :
న్యూ ఇయర్‌ సందర్భంగా BSNL రూ.277 ధరతో (BSNL Rs277 Recharge Plan) ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.

మొత్తంగా ఈ ప్లాన్‌లో 120GB డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పూర్తయ్యాక డేటా వేగం 40kbps కి తగ్గుతుంది. పండుగ సీజర్‌ సందర్భంగా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే జనవరి 16 వ తేదీ వరకు మాత్రమే ఆ ప్లాన్‌ అందుబాటులో ఉంటుందని BSNL (భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌) తెలిపింది.

BSNL రూ.299 ప్లాన్‌ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో (BSNL RS299 Prepaid Recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. అంటే మొత్తంగా 90GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

BSNL రూ.347 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ ప్లాన్‌లో (BSNL RS347 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 108GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ : ఈ ప్లాన్‌లో (BSNL RS485 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 80 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 160GB డేటాను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL introduced Rs277 prepaid recharge plan with 60 days validity as part of new year 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X