Home
News

BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 5 నెలల వ్యాలిడిటీ.. నెలకు రూ.80లోపే!

BSNL 397 plan: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL, ప్రైవేట్ కంపెనీలకు షాక్ ఇస్తూ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ , Vi లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు రేట్లు పెంచుతూ పోతుంటే, BSNL మాత్రం సామాన్యులకు అందుబాటు ధరల్లో ప్లాన్లను అందిస్తోంది. అలాంటి వాటిల్లో బెస్ట్ ప్లాన్ ఒకటి ఉంది. ఇది కేవలం రూ.400 లోపే వస్తుంది, కానీ ఏకంగా 150 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

అంటే నెలకు రూ.80లోపే ఖర్చు వస్తుంది. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే వాళ్లకు, పదే పదే రీఛార్జ్ లు చేసుకోవడం ఇష్టం లేని వాళ్లకు ఈ ప్లాన్ నిజంగా సూపర్ ఛాయిస్. మరి ఈ చీపెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకుందాం పదండి.

BSNL Introduces Affordable Plan with 5 Months Validity Under Rs 400

* BSNL రూ.397 ప్లాన్ బడ్జెట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్!
BSNL తీసుకొచ్చిన రూ.397 రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరలో ఎక్కువ రోజులు ప్లాన్ కావాలనుకునే వాళ్లకు ఒక సూపర్ ఆప్షన్. ఇందులో మొదటి 30 రోజులు ఫ్రీ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ వస్తాయి. అంటే తక్కువ ఖర్చుతోనే ముఖ్యమైన సర్వీసులు అన్నీ వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ సిమ్ ఏకంగా 150 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన టెన్షన్ ఉండదు.

రూ.397 ప్లాన్‌లో బెనిఫిట్స్ ఇవే..
రూ.397 ప్లాన్‌లో మొదటి 30 రోజులు అన్‌లిమిటెడ్ గా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేసుకోవచ్చు. 30 రోజుల తర్వాత ఔట్ గోయింగ్ కాల్స్ ఆగిపోతాయి. కానీ, 150 రోజుల వ్యాలిడిటీ మొత్తం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రం వస్తూనే ఉంటాయి.

డైలీ డేటా విషయానికి వస్తే, మొదటి 30 రోజులు రోజుకి 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది. అంటే మొత్తం 60GB డేటా. అలాగే మొదటి 30 రోజులు రోజుకి 100 SMSలు ఫ్రీగా వాడుకోవచ్చు. BSNL నంబర్‌ను సింపుల్‌గా యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వాళ్లకి, తక్కువ ఖర్చులో మంచి ప్లాన్ కావాలనుకునే వాళ్లకి ఇది సూపర్ ప్లాన్.

* సెకండరీ సిమ్ యూజర్లకు పర్ఫెక్ట్ ఛాయిస్
BSNL సిమ్‌ను సెకండరీ సిమ్‌గా వాడుకునే వాళ్లకు ఈ ప్లాన్ చాలా బాగా సూట్ అవుతుంది. మీ నంబర్ ఇన్‌కమింగ్ కాల్స్ కోసం యాక్టివ్‌గా ఉండాలి అనుకుంటే, మళ్లీ మళ్లీ రీఛార్జ్ లు చేయకుండా ఉండాలి అనుకుంటే, ఈ ప్లాన్ మీకు కరెక్ట్. చాలామంది ఎమర్జెన్సీ కోసం లేదా స్పెషల్ పర్పస్‌ల కోసం సెకండరీ సిమ్ వాడుతుంటారు.

అలాంటి వాళ్లకు ఈ ప్లాన్ డబ్బులు ఆదా చేస్తూనే, కనెక్షన్ కట్‌ కాకుండా చూసుకుంటుంది. ఈ BSNL రూ.397 ప్లాన్ టెలికాం మార్కెట్‌లో ఒక గేమ్ ఛేంజర్ లాంటిది. ఇది ఎక్కువ వ్యాలిడిటీ, ముఖ్యమైన సర్వీసులు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర.. అన్నీ కలిపి అందిస్తోంది.

ఇలాంటి తక్కువ ధర ప్లాన్లను BSNL తీసుకురావడం వల్ల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా వాళ్ల రేట్ల గురించి మళ్లీ ఆలోచించేలా చేస్తోంది. మీకు ఎక్కువ వ్యాలిడిటీతో తక్కువ ధరలో ప్లాన్ కావాలంటే, BSNL ఈ ఆఫర్ ను కచ్చితంగా పరిశీలించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Introduces Affordable Plan with 5 Months Validity Under Rs 400
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X