రూ.99కే 45జిబి డేటా, 4 రకాల ప్లాన్లతో BSNL దూకుడు

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న BSNL మార్కెట్లోకి సరికొత్తగా దూసుకొచ్చింది. భారత్‌లో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌గా మరే ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌ అందించని ప్లాన్లను ఆఫర్‌ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటుకునేందుకు BSNL ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్ బ్యాండ్ రంగంలో దూసుకుపోతున్న ఇతర దిగ్గజాలకు సవాల్ విసురుతూ BSNL నాలుగా కొత్త నాన్‌-ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను ఈ ప్లాన్లలో అమలు చేస్తోంది.

 

జియోఫోన్‌‌ Vs నోకియా 8110 4G, సవాల్ చేసే ఫీచర్లు ఏంటీ ?జియోఫోన్‌‌ Vs నోకియా 8110 4G, సవాల్ చేసే ఫీచర్లు ఏంటీ ?

నాలుగు ప్లాన్లు

నాలుగు ప్లాన్లు

ఒకటి 99 రూపాయల ప్లాన్‌,
రెండు 199 రూపాయల ప్లాన్‌,
మూడు 299 రూపాయల ప్లాన్‌,
నాలుగో 399 బీబీజీ యూఎల్‌డీ కోంబో ప్లాన్
ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు.

డేటా ఆఫర్‌

డేటా ఆఫర్‌

45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేయనున్నామని BSNL కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్‌లోడ్‌ స్పీడు 20 ఎంబీపీఎస్‌. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది.

ప్లాన్ల వివరాలు
 

ప్లాన్ల వివరాలు

99 రూపాయల ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ.

అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా.

299 రూపాయల 300 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా.

399 రూపాయల 600 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 20 జీబీ డేటాను అందించనుంది.

ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌

ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌

ఈ ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్‌ బేసిస్‌లో వీటిని లాంచ్‌చేసింది. డిమాండ్‌ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని..

కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని..

పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది.

500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌

500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌

అయితే ఈ ​ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL introduces daily broadband plans starting from Rs 99 with 45GB benefit More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X