రూ.599కే నెలంతా బ్రాడ్‌బ్యాండ్ (2 Mbps డౌన్‌లోడ్ స్పీడ్)
BB249 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీ సంవత్సరం పాటు పొడిగింపు..
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL), తన అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పై భారీ తగ్గింపును అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా గతంలో రూ.1,199 ఖరీదు చేసే 2 Mbps DSL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇప్పుడు రూ.599కే మీ సొంతమవుతుంది. ఈ కొత్త ప్లాన్ క్రింద 2 Mbps డౌన్‌లోడ్ స్పీడ్ నెలమొత్తం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ కాల్స్ ఉచితం.

రివైజ్ చేయబడిన బ్యాండ్‌విడ్త్‌లో భాగంగా..
రివైజ్ చేయబడిన బ్యాండ్‌విడ్త్‌లో భాగంగా BB249 యూజర్లకు 5జీబి వరకు 2 Mbps స్పీడ్‌తో లభిస్తుంది. ఆ తరువాత డేటా వేగం కాస్తా 1 Mbpsకు పడిపోతుంది. రూ.1,199 స్కీమ్‌లో భాగంగా 50జీబి డేటా వరకు 4 Mbps స్పీడ్ అందుబాటులో ఉంటుంది. 50జీబి డేటా యూసేజ్ దాటిన తరువాత డేటా వేగం 2 Mbpsకు పడిపోతుంది. తాజాగా రివైజ్ చేయబడిన రూ.675 ప్లాన్‌లో భాగంగా 10జీబి డేటా 4 Mbps స్పీడుతో లభిస్తుంది. రూ.999 ప్లాన్ తీసుకున్నట్లయితే 30జీబి డేటా 4 Mbps స్పీడుతో లభిస్తుంది.

సంవత్సరం వ్యాలిడిటీతో BB249 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
రూపాయి కంటే తక్కువ ధరకే ఒక జీబి ఇంటర్నెట్ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీఎస్ఎన్ఎల్ BB249 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీని సంవత్సరం పాటు పొడిగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిటిడీ 6 నెలలు మాత్రమే ఉండేది.

అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్...
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు తమ కొత్త కనెక్షన్‌తో పాటుగా BB249 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే నెల మొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.

2 Mbps వేగంతో..
ఈ ప్లాన్‌లో భాగంగా డేటా యూసేజ్ మొదటి 5జీబి వరకు 2 Mbpsగా ఉంటుంది. ఆ తరువాత నుంచి 1 Mbps ఉంటుంది. ఇప్పటికే ఈ ప్లాన్‌లో జాయిన్ అయిన వారికి సైతం అదనంగా మరో 6 నెలల బెనిఫిట్స్ వర్తిస్తాయి.

Experience Unlimited BB 249
Experience Unlimited BB 249 పేరుతో ఈ ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ కాలపరిమితి పూర్తి అయిన వెంటనే యూజర్లు ‘BBG Combo ULD 499' లేదా రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








