రూ.74తో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 5జీబి డేటా

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. 'రాఖీ పీ సౌఘాట్' పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.74 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 1జీబి డేటాతో పాటు 5 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటుటలో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆగష్టు 15 వరకు ఆఫర్..

ఆగష్టు 3న ప్రారంభమయ్యే ఈ ఆఫర్ ఆగష్టు 15తో ముగుస్తుంది. ఈ ఆఫర్‌తో పాటుగా పలు కాంబో ఆఫర్లను కూడా బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. రూ.189, రూ.289, రూ.389 టారిఫ్‌లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాక్‌లను తీసుకోవటం ద్వారా 18 శాతం అదనపు టాక్‌టైమ్‌తో పాటు 1జీబి ఉచిత డేటా కూడా లభిస్తుంది.

మరో మూడు కొత్త ప్లాన్స్

తమ ప్రీపెయిడ్ చందాదారుల కోసం బీఎస్ఎన్ఎల్ మరో మూడు కొత్త ప్లాన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.258, రూ.378, రూ.548 టారిఫ్‌లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికయితే ఈ ప్లాన్ప్ పాన్-ఇండియా మొత్తం అందుబాటులో లేవు. త్వరలోనే అన్ని సర్కిల్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

రోజుకు 5జీబి డేటా ..

రూ.548 ప్లాన్‌లో భాగంగా 90 రోజుల పాటు రోజుకు 5జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారి కోటా పూర్తయిన తరువాత నుంచి స్పీడ్ క్యాప్ 80Kbpsకు పడిపోతుంది.

రోజుకు 2జీబి డేటా, అపరిమితంగా కాల్స్

రూ.378 ప్లాన్‌లో భాగంగా 30 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ - బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ మధ్య అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

త్వరలోనే అన్ని సర్కిల్స్‌లో

ప్రస్తుతానికైతే పంజాబ్ ఇంకా గుజరాత్ సర్కిల్స్ లో మాత్రమే ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అన్ని సర్కిల్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL introduces ‘Rakhi pe Saugaat’ offer with 1GB data, unlimited calls for Rs 74. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot