Home
News

BSNL సిమ్‌ వినియోగిస్తున్నారా.. కాలింగ్‌, వ్యాలిడిటీ రెండూ కావాలా.. అయితే ఈ ప్లాన్‌ మీకోసమే..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నెట్‌వర్క్‌లోకి ఇటీవల కాలంలో క్రమంగా కొత్త యూజర్లు చేరుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు సంస్థ అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల న్యూ ఇయర్‌ సందర్భంగా రెండు ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. తాజాగా సుమారు 6 నెలల వ్యాలిడిటీతో మరో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

బీఎస్ఎన్‌ఎల్‌ తాజాగా రూ.897 రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL RS897 Recharge Plan) లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. 90GB డేటాను అందిస్తోంది. అయితే ఈ డేటా వినియోగం పరంగా రోజువారీ ఎటువంటి పరిమితి లేదు.

BSNL RS897 recharge plan

90GB డేటాలో రోజుకు ఎంత డేటాను అయినా వినియోగించుకోవచ్చు. అనంతరం ఇంటర్నెట్‌ వేగం 4okbps గా ఉండనుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 180 రోజులుగా ఉంది. BSNL ను రెండు సిమ్‌గా ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఇదే ధరకు ఇతర సంస్థలు కేవలం 3 నెలల వ్యాలిడిటిని మాత్రమే అందిస్తున్నాయి.

BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్‌తో 160 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్‌లో మొత్తంగా 320GB డేటాను పొందవచ్చు. సుమారు ఇదే ధరలో ఇతర సంస్థలు గరిష్ఠంగా 90 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి.

BSNL మరో రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.397 ద్వారా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 30 రోజులపాటు డేటా, కాలింగ్‌, SMS ప్రయోజనాలను పొందవచ్చు. రీఛార్జ్‌ చేసిన తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

30 రోజుల అనంతరం ఈ ప్రయోజనాలు నిలిచిపోతాయి. అనంతరం 150 రోజుల వరకు సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌కమింగ్‌ కాల్‌ సదుపాయం మాత్రమే ఉంటుంది. BSNL ను రెండు సిమ్‌ కార్డుగా ఉపయోగిస్తున్న వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

న్యూ ఇయర్ సమయంలో BSNL రూ.215, రూ.628 రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.215 రీఛార్జ్‌ ప్లాన్‌తో రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

అదే రూ.628 రీఛార్జ్‌ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్లాన్‌ వ్యాలిడిటీ మొత్తంగా 25GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు BSNL ట్యూన్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, లైస్టన్‌ పాడ్‌కాస్ట్‌, హార్డీ గేమ్స్‌, అస్ట్రోసెల్, , జింగ్‌ మ్యూజిక్‌ సహా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL introduces RS897 recharge plan with 180 days validity and 90GB data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X