కీలక నిర్ణయాలు తీసుకుంటున్న BSNL.. తాజాగా ఈ బెస్ట్ ప్లాన్‌లో కీలక మార్పులు..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రూ.99, రూ.197 రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు చేసింది. దీంతోపాటు ఆజాదీ కా ప్లాన్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఉచిత సిమ్ కార్డుతోపాటు రూ.1 కే రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. యూజర్లను ఆకట్టుకొనేందుకు ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు.
తాజాగా మరో ప్లాన్ లో మార్పుల :
అయితే తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ప్లాన్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే అనేక ప్రైవేట్ టెలికాం సంస్థలు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయకుండా.. వ్యాలిడిటీ సహా ప్రయోజనాల్లో మార్పులు చేశాయి. తాజాగా బీఎస్ఎన్‌ఎల్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ తగ్గింపు :
తాజాగా రూ.147 రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ఇది వరకు ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్‌తోపాటు 10GB డేటాను అందించేది. మరియు ప్లాన్ వ్యాలిడిటి 30 రోజులుగా ఉండేది. తాజాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీని 25 రోజులకు తగ్గించింది. అయితే ప్లాన్ ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఆజాదీ కా ప్లాన్ :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ఆజాదీ కా ప్లాన్ పేరుతో (BSNL Azadi Ka Plan) అద్బుతమైన ఆఫర్ ను ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా ఉచితంగా సిమ్ కార్డును పొందవచ్చు. మరియు కేవలం రూ.1 కే అనేక ప్రయోజనాలను అందిస్తోంది.
రూ.1 కే రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్‌న్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. BSNL కొత్త సిమ్ కార్డులపై మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ CSC కార్యాలయాలు, రిటైల్ దుకాణాల్లో సంప్రదించవచ్చని చెప్పింది.
రూ.99 ప్లాన్ లో మార్పులు :
ఇటీవలే BSNL రూ.99 రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులుగా ఉండగా.. 15 రోజులకు కుదించింది. దీంతోపాటు రూ.197 రీఛార్జ్ ప్లాన్ లోనూ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉండేది. ప్రస్తుతం 54 రోజులకు కుదించింది.
రూ.197 ప్లాన్ లో కీలక మార్పులు :
రూ.197 ప్లాన్‌లో భాగంగా యూజర్లు 300 నిమిషాల లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. మొత్తంగా 100 SMS లను పొందవచ్చు. మరియు 4GB డేటాను అందిస్తోంది. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 40 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








