Home
News

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో యూజర్లకు అనేక OTTలకు ఉచిత యాక్సిస్....

భారతదేశంలో అతిపెద్ద ఫిక్స్‌డ్-లైన్ ఆపరేటర్ అయిన BSNL దేశంలో తన వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడం కోసం కొన్ని కొత్త భారత్ ఫైబర్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను విడుదల చేసింది. భారతదేశం అంతటా ఉన్న తన వినియోగదారులందరి కోసం కంపెనీ సూపర్‌స్టార్ ప్రీమియం -1 మరియు సూపర్‌స్టార్ ప్రీమియం -2 వంటి రెండు కొత్త BSNL FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్‌లు కొన్ని ప్రీమియం అప్లికేషన్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందిస్తాయి. ఈ కొత్త ప్లాన్‌లు ఇప్పటి నుండి రెగ్యులర్ ఆఫర్‌గా దాని FTTH సర్వీసుల కొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు ఎలాంటి ప్రమోషనల్ వాలిడిటీ లేకుండా తమకు ఆసక్తి ఉన్న ప్లాన్‌లను ఎంచుకోగలుగుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ ప్రీమియం -1 ప్లాన్ 100 Mbps వేగంతో 1000GB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితి దాటిన తరువాత డేటా వేగం 5 Mbps కి పడిపోతుంది. మరోవైపు సూపర్‌స్టార్ ప్రీమియం-2 ప్లాన్ 150 Mbps వేగంతో 2000GB వరకు FUP డేటాను అందిస్తుంది. ఈ FUP పరిమితిని పూర్తి చేసిన తరువాత డేటా వేగం 10 Mbps కి పడిపోతుంది.

BSNL సూపర్‌స్టార్ ప్రీమియం -2 FTTH ప్లాన్

BSNL సూపర్‌స్టార్ ప్రీమియం -2 FTTH ప్లాన్

BSNL FTTH యొక్క ఈ కొత్త ప్లాన్‌లు వినియోగదారులకు అక్టోబర్ 5 నుండి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో సూపర్‌స్టార్ ప్రీమియం -1 ప్లాన్ యొక్క ధర రూ.749 కాగా సూపర్‌స్టార్ ప్రీమియం -2 FTTH ప్లాన్ ధర రూ.949. ఈ ప్లాన్‌లలోని ఇతర అంశాల విషయానికి వస్తే ఒక నెల సెక్యూరిటీ డిపాజిట్, కనీస అద్దె వ్యవధి ఒక నెల మరియు టెలిఫోన్ స్థిర నెలవారీ ఛార్జీలు లేవు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది.

BSNL FTTH

BSNL FTTH కొత్త ప్లాన్‌లను ఎంచుకునే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా Yupp TV మరియు BSNL Cinamplus సేవలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్‌లతో పాటుగా ఉచిత యాక్సిస్ లభిస్తున్న ఇతర OTT సబ్‌స్క్రిప్షన్‌లలో సోనీ లివ్ ప్రీమియం, ZEE5 ప్రీమియం మరియు వోట్ సెలెక్ట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా Yupp TV లైవ్ టీవీ ఛానెల్‌లు, వెబ్ సిరీస్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లు మరియు తాజా సినిమాలను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లతో OTT సేవలను అందించడానికి అండమాన్ మరియు నికోబార్ సర్కిల్ మినహా అన్ని సర్కిళ్లలోని వినియోగదారుల కోసం ఈ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని అధికారికంగా నిర్ణయించింది. చందాదారులు ఈ ప్లాన్‌లను ఎంచుకున్న వెంటనే బండిల్డ్ OTT సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం Yupp TV యొక్క చెల్లుబాటు మార్చి 31, 2022 కాబట్టి బండిల్ ఆఫర్ సర్వీస్ ప్రొవైడర్‌తో కంపెనీ ఒప్పందం గడువు ముగిసే వరకు చెల్లుతుంది.

BSNL ఇన్స్టిట్యూషన్@791 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

BSNL ఇన్స్టిట్యూషన్@791 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క బ్రాడ్‌బ్యాండ్ కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాన్ మూడు వేర్వేరు సర్వీసులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో కాపర్ కేటగిరీ (DSL) విభాగంలో ఇది 10 Mbps స్పీడ్ తో ఒక నెలకు 791GB వరకు డేటాతో అందుబాటులో ఉంటుంది. అలాగే ఫైబర్ కేటగిరీ విభాగంలో ఈ ప్లాన్ 100 Mbps వేగంతో అందుబాటులో ఉంటుంది. ఈ విభాగంలో ఇది 3.3TB వరకు నెలవారీ డేటాను అందిస్తుంది. చివరగా ఎయిర్ ఫైబర్ విభాగంతో లభించే ఈ ప్లాన్ 45 Mbps వేగంతో 3.3TB నెలవారీ డేటాతో అందుబాటులో ఉంటుంది. BSNL బ్రాడ్‌బ్యాండ్ యొక్క ఈ కొత్త ప్లాన్ ను వినియోగదారులు 12 నెలల చెల్లుబాటుతో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 12 నెలల కొనుగోలు చేసిన వారికి కంపెనీ ఒక నెల ఉచిత సర్వీసును వినియోగదారులకు అందిస్తుంది. అంతేకాకుండా 24x7 ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా వినియోగదారులకు అందించబడింది.

Best Mobiles in India

English summary
BSNL Latest FTTH Broadband Plans Comes With Multiple OTT Apps Free Access
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X