దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు?

Written By:

ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 14 టెలికామ్ సర్కిళ్లలో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ 20 మెగాహెర్ట్జ్ బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఇప్పటికే చండీగఢ్‌లో బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను లాంచ్ చేసింది...

Read More : 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.7,000 నుంచి రూ.15,000 వరకు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎటువంటి లైసెన్స్ ఇబ్బందులు లేకుండా

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు!

ఎంపిక చేసిన 14 సర్కిళ్లలో తాము 2500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉన్నామని, దీనివల్ల ఎటువంటి లైసెన్స్ ఇబ్బందులు లేకుండా 4జీ సర్వీసులను ఈ సర్కిళ్లలో ప్రారంభించగలమని బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న జీఎస్ఎమ్ సైట్లలోనే

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు!

ప్రస్తుతం ఉన్న జీఎస్ఎమ్ సైట్లలోనే 4జీ బేస్ టవర్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని, దీంతో టవర్ల నిర్మాణానికి అదనపు ఖర్చు ఉండదని ఆయన తెలిపారు.

బ్రాండెడ్ కంపెనీలు

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు!

2500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా యాపిల్, మోటరోలా, లెనోవో, గూగుల్ వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

కమర్షీయల్‌గా అందుబాటులోకి

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు!

ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని 2500మెగాహెడ్జ్‌ బ్యాండ్‌తో 4జీ సేవలను కమర్షీయల్‌గా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీఎస్ఎల్ సిద్ధమవుతోంది.

పోటీ మార్కెట్ నేపథ్యంలో...

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు!

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా పోటీ సంస్థలు ఇప్పటికే 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా మరిన్ని సర్కిళ్లలో దీన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to launch 4G services in 14 telecom circles. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot