Home
News

BSNL క్రిస్‌మస్ 2020 కానుక!! 2GB, 3GB డేటా ప్రయోజనాలతో కొత్త ప్లాన్‌లు...

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ క్రిస్‌మస్ 2020 కానుకగా కొత్తగా రూ.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.200 ధర లోపు రోజుకు 2GB డేటాను అందించే ఏకైక టెలికం ఆపరేటర్ గా బిఎస్‌ఎన్‌ఎల్ ఉంది. ప్రైవేట్ టెల్కోలు దీని కంటే 25% ఎక్కువ వసూలు చేస్తున్నాయి. సారూప్య డేటా ప్రయోజనం కోసం కొత్త ప్లాన్ ను ప్రకటించడంతో పాటుగా PV186 ప్లాన్ ను తొలగిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ధృవీకరించింది. రూ.199 ప్రీపెయిడ్ కొత్త రీఛార్జ్ ప్లాన్ PV186 ను భర్తీ చేస్తుంది. అయితే ఇది రెండు రోజుల అదనపు వాలిడిటీతో వస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ రూ.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ రూ.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ కొత్తగా విడుదల చేసిన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రోజుకు 2GB డేటా మరియు రోజుకు 250 నిమిషాలు క్యాప్ తో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ల ప్రయోజనాలను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌లో కూడా బిఎస్‌ఎన్‌ఎల్ 250 నిమిషాల వాయిస్ కాల్స్‌ను పరిమితం చేస్తూనే అందిస్తున్నది. 2020 క్రిస్మస్ సందర్భంగా 2020 డిసెంబర్ 24 నుండి అన్ని టెలికాం సర్కిల్‌లలో రీఛార్జ్ చేయడానికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రత్యేకంగా తెలిపింది.

 

BSNL PV186 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగింపు

BSNL PV186 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగింపు

బిఎస్ఎన్ఎల్ సంస్థ తన యొక్క పోర్ట్ పోలియో నుంచి ప్రస్తుతం రోజుకు 2GB డేటా ప్రయోజనాలతో లభిస్తున్న PV186 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను పూర్తిగా తొలగించింది. ఈ ప్లాన్ 2GB రోజువారి డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. జనవరి 1, 2021 నుండి వినియోగదారులకు రీఛార్జ్ చేయడానికి PV186 ప్లాన్ అందుబాటులో ఉండదు.

రోజుకు 3GB డేటాతో BSNL రూ.998 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు

రోజుకు 3GB డేటాతో BSNL రూ.998 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు

బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ ఇప్పుడు రూ.998 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌లో కూడా మార్పులను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ 2020 డిసెంబర్ 24 నుండి రోజుకు 3GB డేటాను అందించబోతోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క సవరణలు డిసెంబర్ 24 నుండి అమలులోకి రానున్నాయి. ఈ మార్పును ప్రచార ప్రాతిపదికన ప్రవేశపెడుతున్నందున మార్చి 23, 2021 నుంచి తిరిగి దాని పాత ప్రయోజనాలకు అందిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ రూ.998 రీఛార్జ్ ప్లాన్ 240 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అలాగే 60 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ చందాను కూడా ఉచితంగా అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Launch Rs.199 New Prepaid Recharge Plan With 2GB Daily Data Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X