Home
News

అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చిన BSNL.. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందంటే?

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL మహిళల భద్రత కోసం సూపర్‌ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఫీచర్‌ ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌ తో తమ ఫోన్ నంబర్‌ ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ ఫీచర్‌ మహిళలపై వేధింపులను కట్టడి చేయవచ్చని చేస్తుందని భావిస్తోంది.

మహిళలకు ఉపయోగం :
బీఎస్‌ఎన్‌ఎల్‌ కవచ్‌ నంబర్‌ (BSNL Kavach Number) పేరుతో ఈ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. మహిళల ఫోన్‌ నంబర్లు బహిర్గతం కాకుండా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. మహిళల భద్రత, వ్యక్తిగత గోప్యత పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) చెబుతోంది.

bsnl kavach

ఏంటీ కవచ్‌ నంబర్? :
ఈ కవచ్‌ ఫీచర్‌ ను యాక్టివేట్‌ చేసుకున్న యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ వర్చువల్‌ లేదా ప్రత్యామ్నాయంగా మరో నంబర్‌ ను కేటాయిస్తుంది. ఈ వర్చువల్‌ నంబర్‌ మీ అసలు ఫోన్‌ నంబర్‌ కు లింక్‌ చేసి ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది? :
ప్రస్తుతం UPI యాప్‌లు లేదా ఇతర ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా అనేక మంది మొబైల్‌ రీఛార్జ్‌లు చేసుకుంటున్నారు. దీని వల్ల వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మొబైల్‌ రీఛార్జ్‌ దుకాణాలకు వెళ్లి, మీ ఫోన్‌ నంబర్‌ ను రీఛార్జ్‌ చేయాల్సి వస్తే.. కచ్చితంగా మీ నంబర్‌ ను వారికి షేర్‌ చేయాల్సి ఉంటుంది.

అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు మీ నంబర్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అంటే తప్పుడు వ్యక్తులకు ఆ ఫోన్‌ నంబర్లు చేరితే, ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఈ తరహా ఇబ్బందులు, వేధింపులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు BSNL కవచ్ నంబర్‌ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే వర్చువల్‌ నంబర్‌ ను కేటాయిస్తుంది. రీఛార్జ్ దుకాణాల్లో మీ అసలు నంబర్‌ ను షేర్‌ చేయాల్సిన అవసరం లేకుండా వర్చువల్‌ నంబర్‌తోనూ రీఛార్జ్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్‌ నంబర్‌కే ఆ రీఛార్జ్‌ జమ అవుతుంది.

ఈ ఫీచర్‌ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? :
> తొలుత గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్‌ స్టోర్ నుంచి BSNL Self Care యాప్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
> అనంతరం మీ మొబైల్‌ నంబర్‌, OTP సాయంతో లాగిన్ కావాలి.
> ఆ తర్వాత హామ్‌ స్క్రీన్ లేదా మెనూలో కనిపించే కవచ్‌ లేదా ఉమెన్‌ స్పెషన్ ప్రైవసీ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయండి.
> అనంతరం యాక్టివేట్‌ కవర్‌ నంబర్‌ పైన క్లిక్‌ చేయాలి.
> ఆ ప్రక్రియ పూర్తి చేశాక.. మీ ఫోన్ నంబర్‌ కు బదులుగా వర్చువల్‌ నంబర్‌ ను కేటాయిస్తారు.
> ఈ వివరాలు మీకు SMS ద్వారా అందుతాయి.
> ఆ నంబర్‌ను ఉపయోగించి, మొబైల్‌ రీఛార్జ్‌ దుకాణాల్లో రీఛార్జ్‌లు చేయించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launched kavach number feature for women safety, how to activate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X