Home
News

వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్న BSNL. డేటా ఖర్చుతో సంబంధం లేకుండా 500 ఛానళ్లతో IFTV..!

BSNL నుంచి ఇటీవల నేషనల్‌ వైఫై రోమింగ్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే తాజాగా మరో రెండు సర్వీసులను ప్రారంభించింది. యూజర్ల కోసం లైవ్‌ టీవీ సేవల్ని (BSNL Live TV) ప్రారంభించింది. దీంతోపాటు D2D డైరెక్ట్‌ టు డివైస్‌) సర్వీసులను లాంచ్ చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా BSNL 4G టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే సంవత్సరం నాటికి అత్యధిక ప్రాంతాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. 5G నెట్‌వర్క్‌ ను కూడా ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇందుకోసం తొలుత ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

BSNL సంస్థ తాజాగా FTTH (ఫైబర్‌ టు ది హోం) వినియోగదారులకు IFTV ను అందుబాటులోకి తీసుకొచ్చింది. HD క్లారిటీతో లైవ్‌ టీవీ సర్వీసులను అందిస్తుంది. ఈ మేరకు BSNL తన X (ట్విట్టర్‌) ద్వారా ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ కూడా ఫైబర్‌ యూజర్లకు ఈ లైవ్‌ టీవీ సేవల్ని అందిస్తున్నాయి.

bsnl live tv

ఆ నెట్‌వర్క్‌లకు BSNL కు తేడా ఏంటీ ?
అయితే BSNL కు జియో, ఎయిర్‌టెల్‌ సేవల్లో కొంత తేడా ఉంది. BSNL లైవ్‌ టీవీ లో ఛానళ్లను డేటాతో సంబంధం లేకుండా వీక్షించవచ్చు. అదే ఎయిర్‌టెల్, జియో మాత్రం.. ఈ లైవ్‌ టీవీ వినియోగం సమయంలో ఖర్చు అయిన డేటాను యూజర్ల నెలవారీ డేటా నుంచి మినహాయిస్తున్నాయి.

BSNL IFTV ను బఫర్‌ సమస్య లేకుండా వీక్షించవచ్చని X పోస్ట్‌లో పేర్కొంది. దీంతోపాటు హై క్వాలిటీతో ఛానళ్లను చూడవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ లైవ్ టీవీ సేవలు మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ త్వరలో ఈ ఐఎఫ్‌టీవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ టీవీల్లోనే లైవ్‌ టీవీ అందుబాటులో ఉంది.

దీంతోపాటు కేంద్ర టెలికాం శాఖ కీలక ప్రకటన చేసింది. BSNL డైరెక్ట్‌ టు డివైస్‌ (D2D) లాంచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ టెక్నాలజీ ద్వారా రిమోట్‌ ఏరియాలు సహా నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో టెలికాం సేవల్ని అందించవచ్చు. ఇటీవల నిర్వహించిన ఇండియన్ మొబైల్‌ కాంగ్రెస్‌ (IMC 2024) సదస్సులో ఈ సేవల్ని గురించి తెలిపింది.

BSNL D2D టెక్నాలజీ కోసం అమెరికా సంస్థ వయాశాట్‌ (Viasat) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టెక్నాలజీ ద్వారా నెట్‌వర్క్ సహా వైఫై కనెక్టివిటీ అందుబాటులోని లేని ప్రాంతాల్లో అత్యవసర కాల్స్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. SoS మెసెజ్‌లను పంపేందుకు వీలుంటుందని తెలుస్తోంది. శాటిలైట్‌ ద్వారా ఈ సేవల్ని అందించనుంది.

అయితే ప్రస్తుతానికి ఈ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అత్యవసర విభాగాలు, మిలిటరీ సహా ఇతర సంబంధిత అవసరాల కోసం మాత్రమే వినియోగించనున్నారు. ఇటీవల BSNL కొత్త లోగో విడుదల సందర్భంగా ఈ సేవలపై ప్రకటన చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launched live IFTV for fiber users and D2D technology announced by DoT
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X