Home
News

BSNL యూజర్‌లకు గుడ్‌న్యూస్‌.. కొత్త లోగో, 7 ఫీచర్‌లు విడుదల.. ఛార్జీల పెంపుపై CMD కీలక ప్రకటన..!!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త లోగో విడుదల సహా ఇతర 7 కీలక ఫీచర్‌ల విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BSNL లోగోను (BSNL New Logo) ఆవిష్కరించారు. మరియు స్పామ్‌ కాల్స్‌, SMS లకు చెక్ పెట్టడం సహా 7 కొత్త సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ రాబర్ట్‌ రవి కీలక ప్రకటన చేశారు.

సమీప భవిష్యత్‌తో మొబైల్‌ టారిఫ్‌లు (BSNL Tariff Hike News) పెంచే ఆలోచన లేదని BSNL సీఎండీ రాబర్ట్‌ రవి స్పష్టం చేశారు. వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తామని తెలిపారు. మరియు భవిష్యత్‌లో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పారు. ఈ సంవత్సరం జులైలో ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా ఛార్జీలను పెంచాయి.

BSNL launched new logo

టెక్‌ ఇన్నోవేషన్‌లో BSNL ఎప్పుడూ ముందు ఉండాలనేది తమ కోరికని కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా అన్నారు. సొంత టెక్నాలజీతో BSNL 4G అందుబాటులోకి వస్తుందని, తక్కువ సమయంలోనే 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి 4G నెట్‌వర్క్‌ లక్ష సైట్‌లను కలిగి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో BSNL నుంచి కొత్త 7 రకాల సేవలు ప్రారంభం అయ్యాయి. స్పామ్‌ డిటెక్షన్‌, ఆటోమేటెడ్‌ సిమ్‌ కియోస్క్‌లు, డైరెక్ట్‌ టూ డివైస్‌ సేవలు, వైఫై రోమింగ్‌, ఐఫ్‌టీవీ, రియల్‌టైం డిజాస్టర్‌ రెస్పాన్స్‌ సహా సెఫ్టీ ఫీచర్‌లతో సురక్షితమైన నెట్‌వర్క్, గనుల్లో 5G వంటి సేవలను ప్రారంభించింది.

BSNL తన వినియోగదారులకు సురక్షితమైన నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలుగా స్పామ్‌ బ్లాకర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోసపూరిత కాల్స్‌ మరియు మెసేజ్‌ లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. మరియు వాటికి బ్లాక్‌ చేస్తుంది. దీంతోపాటు సిమ్‌ కియోస్కోలు ఏర్పాటు కానున్నాయి. ఫలితంగా 24 గంటలపాటు సిమ్‌ కార్డులు కొనుగోలు, KYC, అప్‌గ్రేడ్‌, పోర్టింగ్‌ వంటి సర్వీసులను పొందేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

దీంతోపాటు డైరెక్ట్‌ టూ డివైస్‌ సర్వీసులను అందించనుంది. అంటే ఎక్కడ నుంచైనా సర్వీసులను అందించేందుకు వీలుగా శాటిలైట్‌ టూ డివైస్‌ కనెక్టివిటీని అందిస్తుంది. మరియు BSNL యూజర్‌లు FTTH వైఫైతో అయినా కనెక్ట్ కావచ్చు. దీంతోపాటు ఫైబర్‌ ఆధారిత ఇంటర్నెట్‌ లైవ్ టీవీ సేవలను తీసుకొచ్చింది. దీని ద్వారా 500 వరకు ప్రీమియం ఛానళ్లను అందించనుంది.

మైనింగ్ కోసం ప్రత్యేకంగా BSNL తక్కువ లేటెన్సీ కలిగిన 5G కనెక్టివిటీని అందించనుంది. గనుల్లో ప్రైవేటు 5G సేవలను అందించనుంది. వీటితోపాటు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL రియల్‌టైం డిజాస్టర్ రెస్పాన్స్‌, పబ్లిక్‌ సేఫ్టీ ఫీచర్‌లు, కమ్యూనికేషన్స్‌తో సురక్షితమైన నెట్‌వర్క్‌ను అందించనుంది.

BSNL 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా 4G టవర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం నాటికి లక్ష టవర్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతోపాటు జూన్‌ 2025 నాటికి 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launched new logo, 7 new service for users and CMD statement on tariff hike full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X