Home
News

న్యూ ఇయర్ సందర్భంగా కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చిన BSNL.. ఇక ఆ సంస్థలకు పోటీ తప్పదా..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌).. న్యూ ఇయర్‌ సందర్భంగా రెండు ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే రూ.277 రీఛార్జ్‌ ప్లాన్‌ను కూడా లాంచ్‌ చేసింది. అయితే ఈ ప్లాన్‌ ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా రూ.215 మరియు రూ.628 ధరల్లో రెండు ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ల కాలింగ్‌, డేటా, ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.628 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (BSNL Rs628 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, నేషనల్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. అదే విధంగా ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు.

BSNL Launched Rs215 and Rs628 Prepaid Recharge plans

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఫలితంగా ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హార్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, గేమన్‌, అస్ట్రోసెల్, లైస్టన్‌ పాడ్‌కాస్ట్‌, జింగ్‌ మ్యూజిక్‌ సహా BSNL ట్యూన్స్‌ను పొందవచ్చు.

BSNL రూ.215 రీఛార్జ్‌ ప్లాన్‌ వివరాలు :
ఈ ప్లాన్‌లో (BSNL Rs215 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌ మరియు నేషనల్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. దీంతోపాటు ప్రతి రోజు 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో 30 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఇటీవలే రూ.277 రీఛార్జ్‌ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌ మరియు నేషనల్‌ కాలింగ్‌, ప్రతి రోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ఈ ప్లాన్‌ 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

ఫలితంగా ప్లాన్‌లో (BSNL Rs277 Prepaid Recharge Plan) మొత్తంగా 120GB డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా వినియోగించుకున్నాక.. డేటా వేగం 40kbps కి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ జనవరి 16 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది.

రెండు రోజుల క్రితం BSNL కీలక ప్రకటన చేసింది. టవర్ల ఏర్పాటు కోసం BSNL పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ను కొందరు క్రియేట్‌ చేసినట్లు సంస్థ తన X హ్యాండిల్‌ ద్వారా తెలిపింది. ఈ వెబ్‌సైట్‌ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. bsnltoweroffice.com పేరుతో అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం BSNL 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 62000 పైగా టవర్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మే నెల నాటికి పూర్తి స్థాయిలో టవర్ల నిర్మాణం పూర్తి చేసి, 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని BSNL భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Launched Rs215 and Rs628 Prepaid Recharge plans for new year 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X