BSNL నుంచి కొత్తగా మూడు ఇంటర్నేషనల్ రోమింగ్ STV వోచర్లు!!
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడం కోసం కొత్త ప్రణాళికలను చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా రూ.895 ధర వద్ద అంతర్జాతీయ రోమింగ్ స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ తన చెన్నై ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. కొత్తగా విడుదలైన మూడు ఎస్‌టివిలు భూటాన్‌కు అధికంగా ప్రయాణించే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటాయి. మూడు వోచర్‌లు మార్చి 23, 2021 నుంచి అమలులోకి వచ్చాయి. భూటాన్‌కు ప్రయాణించే భారతీయులకు ఉపయోగపడే ఈ రీఛార్జ్ ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ STVలు
భూటాన్‌కు అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా మూడు అంతర్జాతీయ రోమింగ్ ఎస్‌టివిలను అందిస్తోంది. ఇందులో మొదటి వోచర్ రూ.895 ధర వద్ద ప్రారంభమవుతుంది. ఈ వోచర్ 1రోజు చెల్లుబాటు కాలానికి లభిస్తూ 200MB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగించే ప్రతి MB డేటాకు రూ.1.8 వసూలు చేయబడుతుంది. అంతేకాకుండా వినియోగదారులు భారతదేశంలోని ప్రజలకు కాల్ చేయడానికి మరియు స్థానిక అవుట్గోయింగ్ మరియు ఇన్కమింగ్ కోసం 40 నిమిషాల కాలింగ్ ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతారు. వినియోగదారులకు అదనంగా 30 SMS లు కూడా లభిస్తాయి.

కొత్తగా ప్రారంభమైన రెండవ అంతర్జాతీయ రోమింగ్ వోచర్ రూ.2,895 ధర వద్ద వస్తుంది. ఈ వోచర్ 7 రోజులు చెల్లుబాటు కాలానికి లభిస్తూ వినియోగదారులకు మొత్తంగా 500MB డేటాను ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత వినియోగించే ప్రతి MB డేటాకు రూ .1.8 ఖర్చు అవుతుంది. అలాగే వినియోగదారులకు 175 నిమిషాల వాయిస్ కాలింగ్ ఉచితంగా అందించబడుతుంది. ఇందులో భారతదేశానికి కాల్ చేయడం లేదా స్థానిక అవుట్గోయింగ్ లేదా ఇన్కమింగ్ కాల్స్ వంటివి ఉన్నాయి. ఈ వోచర్‌లో 50SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి.

చివరగా మూడవ వోచర్ రూ.4,865 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తూ మొత్తంగా 1GB డేటాను అందిస్తుంది. దీని తర్వాత ప్రతి MB డేటాకు రూ.1.8 వసూలు చేయబడుతుంది. భారతదేశానికి కాల్ చేయడానికి వినియోగదారులకు 260 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో స్థానిక అవుట్గోయింగ్ లేదా ఇన్కమింగ్ కూడా లభిస్తుంది. ఈ వోచర్‌లో 100SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి.

ఉచిత నిమిషాల గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఇండియాలో ఉన్న వారికి కాల్ చేయడానికి నిమిషానికి రూ.10.4 చెల్లించవలసి ఉంటుంది. అవుట్గోయింగ్ లోకల్ కాల్స్ చేయడానికి కూడా ఖర్చు ఒకటే. అయితే అవుట్గోయింగ్ అంతర్జాతీయ కాల్స్ కోసం వినియోగదారులకు నిమిషానికి 54.6 రూపాయలు వసూలు చేస్తారు. ఇన్కమింగ్ కాల్స్ కోసం వినియోగదారుల వద్ద నుంచి నిమిషానికి రూ.4.1 మరియు అవుట్గోయింగ్ SMS కొరకు రూ.2 వసూలు చేస్తారు. భూటాన్ నెట్‌వర్క్‌లోకి తిరుగుతున్న వినియోగదారులకు మాత్రమే ఈ వోచర్లు చెల్లుబాటు అవుతాయని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.


Click it and Unblock the Notifications








