BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయ్!
BSNL VoWiFI : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కొత్త సంవత్సరం సందర్భంగా కీలక ప్రకటన చేసింది. తన VoWiFi సర్వీసులను దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ వైఫై కాలింగ్ ఫీచర్ గా పిలుస్తోంది. నెట్‌వర్క్ కవరేజీ సక్రమంగా లేని ప్రాంతాల్లో వైఫై ను ఉపయోగించి, బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపింది.
థర్డ్‌పార్టీ యాప్స్ అవసరమా? :
ఈ ఫీచర్ తో నెట్‌వర్క్ పూర్తిగా లేదా సక్రమంగా లేని ప్రాంతాల్లోని BSNL యూజర్లకు మేలు జరుగుతుంది. IMS ఆధారిత ప్లాట్‌ఫాంపై రూపొందించారు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు యూజర్లకు ఎటువంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్లు అవసరం లేదు.

నాణ్యమైన వాయిస్ కనెక్టివిటీ :
బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు ఇటీవల కాలంలో అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని యూజర్లకు మెరుగైన కనెక్టివిటీ సదుపాయాన్ని అందించేందుకు వీలుగా ఈ వైఫై కాలింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా సరైన నెట్‌వర్క్ కవరేజీ లేకున్నా.. నాణ్యమైన వాయిస్ కనెక్టివిటీ సాధ్యపడుతుంది.
ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ కవరేజీ పరిధి విస్తరణతోపాటు, సెల్యులర్ నెట్‌వర్క్ రద్దీని నియంత్రణలోకి వస్తుందని భావిస్తోంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో బేస్‌మెంట్‌లు, భారీ నిర్మాణాలు కలిగిన భవనాల్లో సహా సరైన కవరేజీ ఉండని ప్రాంతాల్లో ఈ ఫీచర్‌ను ఉపయోగించిన, కాల్స్ చేసుకోవచ్చు.
ఫీచర్ ఉచితం :
బీఎస్ఎన్‌ఎల్ యూజర్లు అందరికీ ఈ ఫీచర్‌ను ఉచితంగానే అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. నెట్‌వర్క్/ కనెక్షన్‌లను ఎంచుకోవాలి. అనంతరం అక్కడ వైఫై కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!
— BSNL India (@BSNLCorporate) January 1, 2026
When mobile signal disappears, BSNL VoWiFi steps in.
Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.
Now live across India for all BSNL customers,
Because conversations… pic.twitter.com/KPUs79Lj9w
* టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నవంబర్ 2025 గణాంకాలను ఇటీవల విడుదల చేసింది. వోడాఫోన్ ఐడియా, MTNL మినహా మిగిలిన సంస్థలు భారీగా కొత్త యూజర్లను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కూడా భారీగా యూజర్లను సంపాదించుకుంది.
4G నెట్‌వర్క్ ప్రారంభం అనంతరం BSNL తన యూజర్లను క్రమంగా ఆకట్టుకుంటోంది. ఈ నవంబర్ నెలలోనూ ఏకంగా 4,21,514 మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. ఫలితంగా 7.92 శాతం మార్కెట్ షేర్‌కు చేరుకుంది. అయితే MTNL మాత్రం నవంబర్ నెలలో 7530 యూజర్లను కోల్పోయింది.
అయితే ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ భారీగా యూజర్లను సంపాదించుకోగా.. వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ మాత్రం భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. నవంబర్ నెలలో జియో (Jio) నెట్‌వర్క్‌లో ఏకంగా 13.88 లక్షల యూజర్లు చేరారు. దీంతో మార్కెట్ షేర్ 41.41 శాతానికి చేరింది.
మరో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) నవంబర్ నెలలో 12.15 లక్షల కొత్త యూజర్లను సంపాదించుకుంది. దీంతో 33.64 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రం నవంబర్ నెలలో ఏకంగా 10.11 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ 17.01 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications








