రెండు తెలుగు రాష్ట్రల యూజర్ల కోసం కొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసిన BSNL
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి రూ.105,రూ.328 అనే సరికొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసింది. అనంత్ ,అనంత్ ప్లస్ అనే పేర్లతో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి .
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి రూ.105,రూ.328 అనే సరికొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసింది. అనంత్ ,అనంత్ ప్లస్ అనే పేర్లతో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అనంత్ ,అనంత్ ప్లస్ ప్లాన్స్...
ఈ ప్లాన్స్ లో ఎటువంటి డేటా కానీ sms బెనిఫిట్స్ కానీ లభించవు. ఈ రెండు ప్లాన్స్ కేవలం అన్ లిమిటెడ్ కాల్స్ కి మాత్రమే.రూ.105 రీఛార్జి చేసుకుంటే అనంత్ ప్లాన్ వర్తిస్తుంది ఈ ప్లాన్ వాలిడిటీ వచ్చి 26 రోజులు మాత్రమే,రూ.328 రీఛార్జి చేసుకుంటే అనంత్ ప్లస్ వర్తిస్తుంది ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే.

'బంపర్ ఆఫర్'....
బీఎస్ఎన్ఎల్ 'బంపర్ ఆఫర్' పేరుతో సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది . ఈ ఆఫర్ క్రింద వీరు రోజుకు 2.2జీబి అదనపు 3జీ డేటాను పొందే వీలుంటుంది. ఈ ఫెస్టివ్ సీజర్ ఆఫర్‌ను సెప్టంబర్ 16 నుంచి పాన్ ఇండియా అంతటా బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999 ప్లాన్‌లను.....
రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకునే కొత్త ప్రీపెయిడ్ కస్టమర్స్‌కు ‘‘ఫెస్టివ్ తోఫా'' క్రింద 60 రోజుల పాటు ఈ అదనపు బెనిఫిట్స్‌తో కూడిన బంఫర్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ.448 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఈ అదనపు డేటా బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది అని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

పండుగులను పురస్కరించుకుని.....
పండుగులను పురస్కరించుకుని అదనపు బెనిఫిట్స్‌తో కూడిన ఫెస్టివ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎమ్‌డి అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

క్రిందటి నెలలో ‘రక్షా బంధన్ ప్లాన్' పేరుతో.....
క్రిందటి నెలలో ‘రక్షా బంధన్ ప్లాన్' పేరుతో ఓ సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 74 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్ ఖరీదు రూ.399. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్ ఇంకా డేటాతో పాటు రోజుకు 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ క్రింద రోజుకో పర్సనలైజిడ్ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications