రూ.1.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజు 2GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.. ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త యూజర్ల కోసం రూ.1 తో ఆజాదీ కా ప్లాన్ (Azadi Ka Plan) పేరుతో ప్రత్యేక ప్లాన్ ను తీసుకొచ్చింది. X పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు.
సిమ్ కార్డు ఫ్రీ, రూ.1 కే ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1 చెల్లించి, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్ కేవలం కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. సిమ్ కార్డును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.

ఆగస్టు 31 వరకు మాత్రమే :
ఈ ఆఫర్ ఆగస్టు నెల మొత్తం ఉంటుందని తెలిపింది. BSNL సిమ్ కార్డును కొనుగోలు చేసేందుకు BSNL CSC, రిటైల్ దుకాణాలను సందర్శించాలని సూచించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త ఆఫర్‌ను BSNL తీసుకొచ్చింది. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
* ఇటీవల BSNL సమీక్ష సమావేశంలో టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 4G విస్తరణ పూర్తయినట్లు చెప్పారు. ఇప్పట్లో టారిఫ్‌ల పెంపు ఆలోచన లేదని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ విస్తరణపైనే తమ దృష్టి ఉందని చెప్పారు.
Azadi ka plan at just Rs. 1/- & get true digital freedom with BSNL.
— BSNL India (@BSNLCorporate) July 31, 2025
With 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM.
Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/L9KoJNVaXG
* బీఎస్‌ఎన్‌ఎల్ గత నెలలో కీలక ప్రకటన చేసింది. గతంలో కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలంటే BSNL ఆఫ్‌లైన్ స్టోర్ లేదా రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆన్‌లైన్ లో ఆర్డర్ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు ఇంటి వద్దకే సిమ్ కార్డులు డెలివరీ చేస్తున్నాయి.
ఇందుకోసం BSNL ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఓ హోం పేజీ వస్తుంది. అవసరం అయిన వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ వివరాల ద్వారా KYC పూర్తి చేయవచ్చు. ఇందులో సిమ్ కార్డు ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ విధానం ద్వారా BSNL కార్యాలయాలకు వెళ్లా్ల్సిన అవసరం లేకుండానే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇతర నెట్‌వర్క్ ల నుంచి BSNL లోకి పోర్టింగ్ అయ్యేందుకు కూడా ఈ లింక్‌లోనే అవకాశం కల్పించింది. ఇలా ఆర్డర్ చేసిన సిమ్ కార్డులు నేరుగా ఇంటి వద్దకే డెలివరీ అవుతాయి.
BSNL కొత్త సిమ్ కార్డుకు సంబంధించిన KYC ప్రక్రియను పూర్తి చేసే సమయంలో ఎటువంటి సమస్యలు తెలెత్తినా సత్వరం పరిష్కారం అయ్యేందుకు వీలుగా BSNL హెల్ప్‌లైన్ నంబర్ 18001801503 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








