గ్రామాల్లోకి దూసుకువెళుతున్న బీఎస్ఎన్ఎల్, AirFibre లాంచ్

By Gizbot Bureau
|

ఇప్పటిదాకా పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీని బీఎస్ఎన్ఎల్ ఇకపై గ్రామాల్లోకి కూడా విస్తరిస్తోంది. పల్లెల్లోనూ ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది. Bharat AirFibre నెట్ వర్క్ సర్వీసు పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా BSNL ఈ కొత్త ఫైబర్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా గ్రామాల్లోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సర్వీసును అందించనుంది. భారత్ ఎయిర్ ఫైబర్ అంటే.. బీఎస్ఎన్ఎల్ అందించే FTTH బ్యాండ్‌విడ్త్ సర్వీసు... వైర్డ్ ఇంటర్నెట్ టెక్నాలజీ FTTH కు దీనికి వ్యత్యాసం ఉంది.

భారత్ ఎయిర్ ఫైబర్ వైర్ లెస్ సర్వీసు

భారత్ ఎయిర్ ఫైబర్ వైర్ లెస్ సర్వీసు

AirFibre వైర్ లెస్ సర్వీసును కంపెనీ తీసుకొచ్చింది. ‘భారత్ ఎయిర్ ఫైబర్ వైర్ లెస్ సర్వీసును ప్రారంభించాం. ఉచిత స్పెక్ట్రామ్ బ్యాండ్ తో అందిస్తున్నాం. ప్రధానంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ తెలిపారు.

లైన్ ఆఫ్ సైట్ రేడియో వేవ్స్ ద్వారా

లైన్ ఆఫ్ సైట్ రేడియో వేవ్స్ ద్వారా

ఎయిర్ ఫైబర్ సర్వీసును లైన్ ఆఫ్ సైట్ రేడియో వేవ్స్ ద్వారా గ్రామాలకు కాల్ సెంటర్ సర్వీసులను అందించనుంది. వైఫై రూటర్లు, మైక్రోవేవ్స్ ఒవెన్స్ లేని గ్రామాల్లో భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసులు ఈజీగా అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఎయిర్ ఫైబర్ కనెక్షన్ సాయంతో ట్రిపుల్ ప్లే సర్వీసులను BSNL అందించనుంది. 

కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసులను మాత్రమే కాదు

కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసులను మాత్రమే కాదు

దీని ద్వారా యూజర్లు కేవలం కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసులను మాత్రమే కాదు.. TV సర్వీసులను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. Yupp TV భాగస్వామ్యంతో టీవీ కంటెంట్ కూడా BSNL అఫర్ చేస్తోంది. ఈ టెలికం ఆపరేటర్, తమ ఎయర్ పైబర్ సర్వీసు ద్వారా గ్రామీణ పారిశ్రామికవేత్తలను కూడా శక్తివంతం చేయాలని భావిస్తోంది. గ్రామీణ పారిశ్రామికవేత్తలు తమ గ్రామాల్లో ఎయిర్ ఫైబర్ సర్వీసు కోసం రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తోంది.

ప్రారంభ ధర రూ.500 నుంచి 

ప్రారంభ ధర రూ.500 నుంచి 

ఇందులో ఎయిర్ ఫైబర్ పరికరాల ఇన్‌స్టాలేషన్ కు సబ్ స్ర్కైబర్ల నుంచి రూ. 3వేలు వరకు ఛార్జ్ చేయనుంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసుపై ప్రారంభ ధర రూ.500 నుంచి నెలవారీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
BSNL launches Bharat AirFibre for villages: Here’s what you need to know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X