Home
News

BSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీ

ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈద్ ముబారక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

By Hazarath Aiah

ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈద్ ముబారక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇటీవల ఫిఫా వరల్డ్‌ కప్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసిన సంస్థ తాజాగా ఈద్‌ ముబారక్‌ పేరుతో మరో ఎస్‌టీవీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 786 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటా ఆఫర్‌ చేస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌తోపాటు, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ స్పెషల్‌ ప్లాన్‌వాలిడిటీ 150 రోజులు. ఈ లిమిటెడ్‌ పీరియడ్‌ ప్రస్తుతానికి ఢిల్లీ,ముంబైలో అందుబాటులో ఉంటుంది. జూన్‌ 12నుంచి 26 తేదీల మధ్య ఈ ప్లాన్‌ రీచార్జ్‌కు లభ్యమవుతుంది. లిమిటెడ్‌ పీరియ్‌డ్‌ ఆఫర్‌ లాంచ్‌ చేసిన ఈ స్పెషల్‌ ప్లాన్‌ దేశవ్యాప్తంగా లాంచ్‌ చేసేదీ లేనిదీ క్లారిటీ రావాల్సి ఉంది.

రూ.149 ప్లాన్‌

రూ.149 ప్లాన్‌

ఇప్పటికే స్పెషల్‌ డేటా ఎస్‌టీవీ రూ.149 కే అందుబాటులోకి తెచ్చిన ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రోజుకు 4 జీబీ మొబైల్ డేటా ఫ్రీ అందిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ ఫుట్‌బాల్‌ ప్రపంచ్‌ కప్‌ పోటీ సందడి మొదలైన నేపథ్యంలో క్రీడాభిమానులకోసం ఈ స్పెషల్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది.

అన్‌లిమిటెడ్ కాల్స్

అన్‌లిమిటెడ్ కాల్స్

ఈ భారీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు లభిస్తాయి. జూన్ 14 నుండి జూలై 15వతేదీ ఈ ప్లాన్ (ఫిఫా వరల్డ్ కప్ జరిగే చివరి తేదీ) అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

జియోలో రూ.149 ప్లాన్‌లో

జియోలో రూ.149 ప్లాన్‌లో

కాగా జియోలో రూ.149 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుండగా, దీనికి అదనంగా తాజాగా రోజూ మరో 1.5 జీబీ డేటాను జియో ప్రారంభించింది. దీంతో ఈ ప్లాన్‌లో జియో కస్టమర్లకు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్‌ చేస్తోంది.

4 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు

4 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు

ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ నాలుగా కొత్త నాన్‌-ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. అవి ఒకటి 99 రూపాయల ప్లాన్‌, రెండు 199 రూపాయల ప్లాన్‌, మూడు 299 రూపాయల ప్లాన్‌, నాలుగో 399 బీబీజీ యూఎల్‌డీ కోంబోలతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వీటిని ప్రవేశపెట్టింది.

600 జీబీ వరకు డేటా

600 జీబీ వరకు డేటా

ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు. 45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేయనున్నామని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్‌లోడ్‌ స్పీడు 20 ఎంబీపీఎస్‌. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది.

ప్లాన్ల వివరాలు

ప్లాన్ల వివరాలు

99 రూపాయల ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ.
అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా.
299 రూపాయల 300 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా.
399 రూపాయల 600 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 20 జీబీ డేటా.

ఉచిత ఈ-మెయిల్‌ ఐడీ

ఉచిత ఈ-మెయిల్‌ ఐడీ

ఈ ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్‌ బేసిస్‌లో వీటిని లాంచ్‌చేసింది.

తుదిగడువును పెంచాల్సి వస్తే

తుదిగడువును పెంచాల్సి వస్తే

డిమాండ్‌ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది.

500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌

500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌

అయితే ఈ ​ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launches Eid Mubarak STV 786 plan; offers unlimited calls, 2GB data per day More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X