బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్: ఫోన్ జాడ ఇట్టే పట్టేస్తుంది!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎమ్‌సెక్యూర్ (mSecure) పేరుతో సరికొత్త మొబైల్ సెక్యూరిటీ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బియాండ్ ఇవల్యూషన్ అనే సంస్థ సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఈ వాల్యూ యాడెడ్ సెక్యూరిటీ సర్వీస్‌ను ఆఫర్ చేస్తోంది.

ఈ యాప్‌ను వినియోగించుకోవటం ద్వారా వినియోగదారులు తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లకు సంబంధించి ట్రాక్ లొకేషన్‌ను పొందవచ్చు, అంతేకాకుండా డివైస్‌ను లాక్ చేసి ఫోన్‌లోని డేటాను పూర్తిగా చెరిపేయవచ్చని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (కన్స్యూమర్ మొబిలీటీ విభాగం) అనుపమ్ శ్రీవాస్తవా తెలిపారు.
ఈ అప్లికేషన్, యూజర్ పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పూర్తి కాల్‌లాగ్ అలానే డేటా లోకేషన్‌కు సంబంధించిన వివరాలను ముందుగానే అనుసంధానించిన ఎమర్జెన్సీ నెంబర్‌కు ఎస్ఎంఎస్‌ల రూపంలో ఎప్పటికప్పుడు పంపుతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








