జియో నుంచి రోజు రోజుకు పోటీ ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని టెల్కో దిగ్గజాలు తమ వినియోగదారులను జియోకి తరలిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తమ యూజర్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మూడు రకాల సరికొత్త ప్లాన్లను విడుదల చేసింది.
శాంసంగ్ ఫోన్లపై రూ. 8 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్
రూ.186, రూ.187, రూ.485..
ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.186, రూ.187, రూ.485 పేరిట మూడు రకాల ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ విడుదల చేసింది.
రూ.186 ప్లాన్..
రూ.186 ప్లాన్ ద్వారా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. 1జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. అయితే ఈ ప్లాన్‌లో లభించే డేటాకు మాత్రం కేవలం 28 రోజుల వాలిడిటీని మాత్రమే ఇస్తున్నారు.
రూ.187 ప్లాన్
అదేవిధంగా రూ.187 ప్లాన్‌లో డేటా ఏమీ లభించదు. కాకపోతే ఇందులో ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ పెట్టుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఉచిత రోమింగ్, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి.
రూ.485 ప్లాన్
రూ.485 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాకు 90 రోజుల వాలిడిటీ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులుగా ఉంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.