BSNL నుంచి రూ.2022 తో దీర్ఘ కాల‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ విడుద‌ల‌!

|

భార‌త ప్ర‌భుత్వ రంగం టెలికాం సంస్థ BSNL, త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప్లాన్ల‌ను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా, 2022 "అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు" జ‌రుపుకుంటున్న త‌రుణంలో రూ.2022 పేరుతో మ‌రో స‌రికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్ ద్వారా యూజ‌ర్ల‌కు అప‌రిమిత ప్ర‌యోజనాల‌ను అందిస్తోంది.

 
BSNL నుంచి రూ.2022 తో దీర్ఘ కాల‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ విడుద‌ల‌!

దీర్ఘ‌కాల వ్యాలిడిటీ కోసం వేచి చూసే వారి కోసం BSNL ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జీ చేసుకున్న వినియోగ‌దారులు నెల‌కు 75జీబీల డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారులై ఉండి.. రీజ‌న‌బుల్ ధ‌ర‌లో లాంగ్ ట‌ర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే.. ఇది మీకు స‌రైన ఎంపిక. ఇప్పుడు ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

BSNL రూ.2022 ప్రీపెయిడ్ ప్లాన్ వివ‌రాలు:
బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చిన ఈ రూ.2022 ప్లాన్ లాంగ్ ట‌ర్మ్ వ్యాలిడిటీ ప్లాన్‌. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మరియు సేవ‌లు 300 రోజులు ఉంటాయి. ఈ ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజ‌ర్లు ప్రతి నెలా 76జీబీల డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ప‌లు అప‌రిమిత ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

ఈ రూ.2022 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 మెసేజ్ సేవ‌ల‌ను కూడా పొందొచ్చు. నెల‌లో 75జీబీల డేటా వినియోగం పూర్తి అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. అయితే, ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. డేటా మొద‌టి 60 రోజులు మాత్ర‌మే వ‌స్తుంది. ఆ త‌ర్వాత మీరు డేటా కావాలంటే.. డేటా వోచ‌ర్స్‌ను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL నుంచి రూ.2022 తో దీర్ఘ కాల‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ విడుద‌ల‌!

ఇది AzadiKaAmritMahotsavPV_2022 సంద‌ర్భంగా ఆఫర్‌గా BSNL ద్వారా ప్రారంభించబడిన ఆసక్తికరమైన డేటా వోచర్. ఈ ఆఫర్ ఆగస్టు 31, 2022 వరకు అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఈ వోచర్‌ని పొందాలనుకుంటే, ఈ నెలలోనే దీన్ని రీఛార్జీ చేయండి. మీరు మీ ప్రాంతంలో BSNL నుండి అంత‌రాయాలు లేని నెట్‌వర్క్ సేవలను పొందుతున్నట్లయితే, ఇది మీకు అద్భుతమైన దీర్ఘకాలిక భాగస్వామిగా నిరూపించబడుతుంది.

ఇదిలా ఉండ‌గా.. BSNL కూడా త్వరలో 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించే పనిలో ఉందన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ‌, BSNL వినియోగదారులకు బలమైన 4G కవరేజీని మరియు వేగాన్ని అందించగలిగితే.. వినియోగదారులకు అందించే మొత్తం యుటిలిటీలో ఈ ప్లాన్ విలువ పెరుగుతుందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

BSNL నుంచి రూ.2022 తో దీర్ఘ కాల‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ విడుద‌ల‌!

మొబైల్ లో రెండో సిమ్ మాత్రం యాక్టివ్‌గా ఉండాల‌ని భావించే వారికి BSNL త‌క్కువ ధ‌ర‌లో, అద్భుత‌మైన ప్లాన్ల‌ను అందిస్తోంది. వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం:
BSNL నెట్‌వ‌ర్క్‌ను ప్రైమ‌రీ సిమ్‌గా ఉప‌యోగించ‌డానికి సరైన‌ది కాన‌ప్ప‌టికీ.. రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవ‌డానికి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మొబైల్‌లో రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాల‌ని భావించే వారికి BSNL త‌క్కువ ధ‌ర‌లో అద్భుత‌మైన ప్లాన్ల‌ను అందిస్తోంది. ప్రత్యేకించి చిన్న చిన్న ప‌నులు చేసుకునేవారు ఎక్కువ ధ‌ర చెల్లించి ప్లాన్ల‌ను పొంద‌లేరు.. కాబ‌ట్టి అలాంటి వారికి కూడా సిమ్‌కార్డు యాక్టివ్‌గా ఉంచుకునేందుకు BSNLప్లాన్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈరోజు, మేము BSNL నుండి రూ. 100లోపు ధ‌ర క‌లిగిన‌ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఇవి త‌క్కువ ధ‌ర‌లోనే సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

BSNL రూ.87 ప్లాన్‌:
ఈ BSNL రూ.87 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం మొబైల్ గేమింగ్ బెనిఫిట్స్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది. ప్ర‌స్తుతం టెలికాం ఇండస్ట్రీలో అత్యంత త‌క్కువ ధ‌రలో బెస్ట్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది.

BSNL నుంచి రూ.2022 తో దీర్ఘ కాల‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ విడుద‌ల‌!

BSNL రూ.97 ప్లాన్‌:
రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాల‌నుకునే యూజ‌ర్ల‌కు ఇది కూడా బెస్ట్ ప్లాన్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా ఎస్ఎంఎస్ లు క‌ల్పించ‌డం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది.

BSNL రూ.99 ప్లాన్‌:
ఈ BSNL రూ.99 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు పీఆర్‌బీటీ బెనిఫిట్స్ కూడా పొంద‌వ‌చ్చు. మీరు డేటా గురించి అస్సలు పట్టించుకోనట్లయితే మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రమే కావాలనుకుంటే కనుక మీరు STV_99 ప్లాన్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL Launches New Rs 2022 Prepaid Plan with 75GB Data Per Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X