బీఎస్ఎన్ఎల్ సరికొత్త రూ.399 'రాఖీ' ప్లాన్
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త డేటా ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త డేటా ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. 'రాఖీ ' పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.399 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 74 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా ,అన్‌లిమిటెడ్ కాల్స్ తో అందుబాటుటలో ఉంటాయి.ఈ ప్లాన్ రేపటి నుంచి అనగా ఆగష్టు 26 నుంచి అందుబాటులో ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్...
బీఎస్ఎన్ఎల్ యూజర్ రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే 74 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా ,అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకి 100 SMS లు లభిస్తాయి. అంతేకూండా Personalized Ring Back Tone (PRBT) విత్ అన్ లిమిటెడ్ సాంగ్ చేంజ్ ఆప్షన్ సౌకర్యం కూడా ఉంది.ఈ ప్లాన్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.29 ప్లాన్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.29 రీఛార్జ్ ప్లాన్ అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 2 జీబీ ఉచిత డేటా తో 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే.

బీఎస్ఎన్ఎల్ రూ.9 ప్లాన్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.9 రీఛార్జ్ ప్లాన్ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే.

కేరళలోని యూజర్ల కోసం....
కేరళలోని యూజర్ల కోసం కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది, Fibro BBG ULD 995, 2Mbps FUP వేగం అందిస్తుంది. ఈ ప్రణాళిక రూ.995 కోసం 20Mbps వేగంతో 200GB లిమిటెడ్ డేటాతో వస్తుంది.ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే.


Click it and Unblock the Notifications








