Home
News

ధర రూ.249 తో BSNL కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. 45 రోజుల వ్యాలిడిటీతో ఎన్నో ప్రయోజనాలు..!

ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా గత వారం.. తమ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ రీఛార్జీ ధరలను భారీగా పెంచాయి. జియో, ఎయిర్‌టెల్‌, పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానుండగా.. వోడాఫోన్‌ ఐడియా కొత్త ధరలు జులై 4 నుంచి అమలు కానున్నాయి. ఈ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కొత్త రీఛార్జ్‌ను ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

BSNL తాజాగా రూ.249 తో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే.. ఈ ప్లాన్‌ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. 90GB డేటాను పొందవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

BSNL launches RS 249 Prepaid recharge plan with 45 days of validity

* గత నెలలో BSNL రెండు ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.108, రూ.107 ధరల్లో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. BSNL వినియోగదారులు రూ.108 తో రీఛార్జీ చేయించుకుంటే.. రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది.

ఈ ప్లాన్‌లో ఎటువంటి SMS లను ఉచితంగా అందించడం లేదు. అయితే లోకల్‌ SMS లకు 80 పైసలు, నేషనల్ SMS కు రూ.1.20 వసూలు చేస్తారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. తక్కువ ధరలో మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్న ప్లాన్‌లలో ఇది ఒకటిగా ఉంది.

BSNL రూ.107 ఈ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం లేదు. 200 నిమిషాల పాటు మాత్రమే ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 3GB డేటాను పొందవచ్చు. అయితే BSNL ట్యూన్స్‌ ను పొందవచ్చు. మరియు ఈ ప్లాన్‌ లో ఎటువంటి ఉచిత SMS ప్రయోజనాలు అందుబాటులో లేవు. ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది.

* BSNL యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 4G సర్వీసులను ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పంజాబ్‌ లో 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ మెరుగైన ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పంజాబ్‌లో సుమారు 8 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది.

భారత ప్రభుత్వం టెలికాం పరిశోధన సంస్థ C-DoT మరియు ఐటీ సంస్థ TCS ల కన్సార్షియం రూపొందించిన స్వదేశీ టెక్నాలజీతోని BSNL ఉపయోగిస్తోంది. ఈ కన్సార్షియం తయారుచేసిన క్లిష్టమైన టెక్నాలజీ పూర్తి స్థాయిలో స్థిరపడేందుకు (Stabilize) 12 నెలల సమయం పడుతుండగా.. కేవలం 10 నెలల్లోనే స్టెబిలైజ్‌ అయిందని అధికారులు తెలిపారు.

ఈ ఆత్మనిర్బర్ భారత్‌ విధానంలో BSNL 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్‌ అయ్యేలా రూపొందించారు. 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనున్నారు. పటిష్ఠంగా 4G నెట్‌వర్క్‌ ను విస్తరించేందుకు పూర్తి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launches RS 249 Prepaid recharge plan validity data unlimited calling and more benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X