జియో ఎఫెక్ట్, BSNL 54 రోజుల ప్లాన్, unlimited calls, 54GB డేటా

దేశీయ టెలికా రంగంలో జియోతో పోటీగా దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.349కు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.

|

దేశీయ టెలికా రంగంలో జియోతో పోటీగా దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.349కు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 54 రోజులుగా నిర్ణయించారు. దీంతో మొత్తం 54 రోజులకు గాను రోజుకు 1జీబీ డేటా చొప్పున 54 జీబీ డేటా కస్టమర్లకు లభిస్తుంది. ఇక జియోలో ఇదే ప్లాన్ రూ.349కే అదే ధరలో అందుబాటులో ఉండగా ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులుగా ఉంది. దీంతో 70 రోజులకు కలిపి మొత్తం 105 జీబీ డేటా కస్టమర్లకు వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్లాన్‌కు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ సదరు నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

మే 17న మార్కెట్లోకి OnePlus 6, ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మీకోసం !మే 17న మార్కెట్లోకి OnePlus 6, ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మీకోసం !

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఐపీఎల్‌ ప్లాన్‌

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఐపీఎల్‌ ప్లాన్‌

248 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా వస్తుంది.
ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు ఎస్‌టీవీ రూ.248పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది.

రూ.999

రూ.999

రూ.999తో రీచార్జ్‌ చేసుకుంటే ఒక ఏడాది పాటు రోజుకు ఒక జీబీ డేటా, ఆరు నెలల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వినియోగించుకోవచ్చు.డేటా పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వస్తుంది. ఇక ప్రతిరోజూ 100 ఎస్సెమెస్‌లు ఉచితంగా లభిస్తాయి. 

రూ.1,099 ప్లాన్‌
 

రూ.1,099 ప్లాన్‌

వాయిస్‌ కాల్స్‌ : ఈ రూ.1,099 ప్రీపెయిడ్‌ డేటా రీఛార్జ్‌ ఓచర్‌ కింద అపరిమిత కాల్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తోంది. హోమ్‌ సర్కిల్‌కు, నేషనల్‌ రోమింగ్‌కు ఈ కాల్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
రూ.1,099 ప్రీపెయిడ్‌ డేటా ఓచర్‌లో 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా అందించనుంది. అంటే వాలిడిటీ పిరియడ్‌ అయిపోయేంత వరకు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సబ్‌స్క్రైబర్లు పంపించుకోవచ్చు.
84 రోజుల తర్వాత డేటా వాడకంపై యూజర్లకు 10 కేబీ డేటాకు 3 పైసల ఛార్జీ విధించనుంది.
రూ.1,099 రీఛార్జ్‌ ప్యాక్‌లో పీఆర్‌బీటీ(పర్సనలైజడ్‌ రింగ్‌ బ్యాక్‌ టోన్‌ ఫెసిలిటీ) అందుబాటులో ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేసే ఈ స్పెషల్‌ సర్వీసు ద్వారా డిఫాల్ట్‌ రింగ్‌నే కాకుండా యూజర్లు సరికొత్త ట్యూన్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

మరికొన్ని ప్లాన్లు

మరికొన్ని ప్లాన్లు

రూ. 444 ప్లాన్‌:1.5జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్‌, 60 రోజులు వాలిడిటీ.
రూ.666 ప్లాన్‌: 1 జీబీ 4జీడేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్‌, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు,129 రోజులు వాలిడిటీ.
రూ.485 ప్లాన్‌: రోజుకు1 జీబీ 4జీడేటా, రోజుకి వంద ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌కాల్స్‌, 90 రోజులు వాలిడిటీ.

రూ. 118 ప్లాన్

రూ. 118 ప్లాన్

కస్టమర్లు రూ.118తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. కాగా ఇదే తరహా ప్లాన్ జియోలో రూ.98కి లభిస్తోంది. జియోలో ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటా లభిస్తాయి

రూ.379 ప్లాన్‌

రూ.379 ప్లాన్‌

కస్టమర్లు రూ.379తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వాలిడిటీతో 4జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే BSNL-to-BSNL voice calls రోజుకు 30 నిమిషాల పాటు వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ జియో రూ.349, రూ.399కి పోటీగా ఉంది.

రూ. 551 ప్లాన్

రూ. 551 ప్లాన్

కస్టమర్లు రూ.551తో రీ ఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. దీంతో ఎలాంటి వాయిస్ కాల్స్ రావు. దీంతో పాటు రూ. 444 ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా 60 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. దీంతో పాటు ఎంపిక చేసిన సర్కిళ్లకు రూ.666 ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రోజుకు 1GB 4G data, unlimited voice calls, 100 SMS messages 129 రోజుల పాటు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
BSNL takes on Reliance Jio with Rs 349 prepaid plan, offers unlimited calls and 54GB data More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X